దిల్ రాజు: అనిల్ రావిపూడిని హీరోని చేస్తాను..

ABN, Publish Date - Apr 06 , 2026 | 09:36 AM

దర్శకుడు అనిల్‌ రావిపూడిని హీరోని చేస్తానన్నారు నిర్మాత దిల్ రాజు. అనిల్‌ మంచి సినిమాలు తీస్తున్నారని.. పైగా  హీరోలా  ఉంటాడని, ఆయనను ఎప్పటికైనా హీరోగా  పరిచయం చేస్తానని అన్నారు. ఆదివారం హైదరాబాద్ లో  జరిగిన ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దిల్ రాజు, అనిల్ రావిపూడి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్ రాజ్.. అనిల్ రావిపూడి గురించి మాట్లాడారు. ప్రదీప్‌ రంగనాథన్, కృతిశెట్టి  జంటగా నటించిన ఈ చిత్రానికి  విఘ్నేశ్‌ శివన్‌  దర్శకుడు. నయనతార నిర్మించారు. ఈనెల 10న సినిమా రానుంది.  

Updated at - Apr 06 , 2026 | 01:23 PM