ధురంధర్.. ది రివెంజ్: యాక్షన్ ట్రైలర్ వచ్చేసింది
ABN, Publish Date - Mar 07 , 2026 | 11:07 AM
రణవీర్‌సింగ్ హీరోగా 'ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar: The Revenge) సినిమా ట్రైలర్ గురించి అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. శనివారం ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో హై-ఆక్టేన్ స్పై-యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. జియో స్టూడియోస్ సమర్పణలో, బి62 స్టూడియోస్ బ్యానర్‌పై జ్యోతి దేశ్‌పాండే, లోకేష్‌ధర్ నిర్మించారు. ఇందులో ఈ చిత్రంలో రణవీర్‌సింగ్ జస్కిరత్ సింగ్ రంగి, హమ్జా అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. మార్చి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి యాక్షన్ సన్నివేశాలతో కట్ చేసిన ఈ ట్రైలర్ ను మీరు చూసేయండి.
Updated at - Mar 07 , 2026 | 11:12 AM