ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌: ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా.. మాస్‌ బీట్‌ అదిరిపోయింది

ABN, Publish Date - Mar 10 , 2026 | 05:08 PM

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ చిత్రం నుంచి మూడో పాట ఈ నెల 12న విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్‌ మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం ‘ఎత్తరా.. ఎత్తరా కాలరే ఎత్తరా’ అంటూ సాగే మాస్‌ సాంగ్‌ను వదిలారు. కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించిన ఈ పాటను రామ్‌ మిరియాల ఆలపించారు. దేవి అందించిన మాస్‌ బీట్‌ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఆ పాటను మీరూ వినేయండి..

Updated at - Mar 10 , 2026 | 05:08 PM