అలరించేలా ‘వింటారా సరదాగా’ సెకండ్‌ సింగిల్‌..

ABN, Publish Date - Jul 16 , 2026 | 10:52 AM

అశోక్‌ గల్లా, శ్రీగౌరి ప్రియా జంటగా నటిస్తున్న ‘వింటారా సరదాగా’ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ ను విడుదల చేశారు

అశోక్‌ గల్లా, శ్రీగౌరి ప్రియా జంటగా నటిస్తున్న చిత్రం ‘వింటారా సరదాగా’. రాహుల్‌ విజయ్‌, శివాత్మిక రాజశేఖర్‌ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఉద్భవ్‌ రఘు దర్శకత్వంలో నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ‘చింగారి నా చిరునవ్వుల ఓ సింగారి’ అంటూ సాగే సెకండ్‌ సింగిల్‌ను గురువారం విడుదల చేశారు. విజయ్‌ బుల్గానిన్‌ సంగీతంలో ఈ లవ్‌ సాంగ్‌ను సిద్‌ శ్రీరామ్‌, లిప్సిక ఆలపించారు.

Updated at - Jul 16 , 2026 | 10:58 AM