బ్యాండ్ మేళం: ఎనర్జిటిక్ సాంగ్ వదిలిన అనిల్ రావిపూడి
ABN, Publish Date - Feb 22 , 2026 | 10:14 AM
హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కావ్య, శ్రావ్య నిర్మిస్తున్నారు. మార్చి 13న విడుదల చేయబోతున్నారు. తాజాగా తిప్పుకుంటన్నవ్’ అని సాగే ఫస్ట్ సింగిల్ ను అనిల్ రావిపూడి విడుదల చేశారు. విజయ్ బుల్గానిన్ సంగీతంలో రాము రాథోడ్, అదితి భావరాజు ఆలపించారు. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. వెంకటేష్ కాపు కొరియోగ్రఫీలో హర్ష్ రోషన్, శ్రీదేవీ డ్యాన్స్ మూమెంట్స్ అదరగొట్టేశారు..
Updated at - Feb 22 , 2026 | 10:53 AM