వినోదాత్మకంగా 'బ్యాండ్ మేళం' ట్రైలర్
ABN, Publish Date - Mar 21 , 2026 | 02:30 PM
హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన విలేజ్ లవ్ ఎంటర్టైనర్ 'బ్యాండ్ మేళం'. సతీష్ జువ్వాజి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ను చిరంజీవి విడుదల చేశారు. బావా మరదళ్ల చిన్నప్పటి స్నేహం, స్కూల్లో అల్లరి, బ్యాండ్ మేళం ట్రూప్ చేసే సందడి ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది. కుటుంబ నేపథ్యంలో ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చారు. చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమించిన మరదలు దూరమైతే ఆ బావ పడే వేదన, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల 26న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ట్రైలర్ ను మీరు చూసేయండి..
Updated at - Mar 21 , 2026 | 04:16 PM