గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ బాలకృష్ణ ఎపిక్ యాక్షనర్ నుండి గ్లింప్స్!

ABN, Publish Date - Jun 10 , 2026 | 05:56 PM

గాడ్‌ ఆఫ్‌ మాసెస్ బాలకృష్ణ లేటెస్ట్ మూవీ నుంచి గ్లింప్స్ వచ్చింది. గోపీచంద్‌ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా మరో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కానున్నదని ఈ గ్లింప్స్ చూస్తే అర్థమౌతోంది.

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ యాక్షన్ స్పెషలిస్ట్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ఎన్.బి.కె. 111. ఇప్పటికే మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడంతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పవర్‌ఫుల్ యాక్షన్, భారీ స్థాయి మేకింగ్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ను విడుదల చేశారు. No More Vintage, Only New Age అనే ట్యాగ్‌లైన్ బాలకృష్ణను సరికొత్త అవతారంలో చూపించిన ఈ గ్లింప్స్ అదిరిపోయింది. ఆద్యంతం యాక్షన్ తో సాగిన ఈ గ్లింప్స్ కు తమన్ అందించిన నేపథ్య సంగీతం మరో హైలైట్‌. మంచు మనోజ్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను హై వోల్టేజ్‌ యాక్షన్ డ్రామాగా గోపీచంద్‌ మలినేని తెరకెక్కిస్తున్న ఈ గ్లింప్స్ చూస్తే అర్థమౌతోంది.

Updated at - Jun 10 , 2026 | 05:56 PM