Seetha Payanam: పాట‌ల‌ను మించి.. సినిమా! సీతా ప‌య‌నం.. ట్రైల‌ర్ రిలీజ్‌

ABN , Publish Date - Feb 07 , 2026 | 08:04 PM

యాక్ష‌న్ కింగ్ అర్జున్ స్వీయ నిర్మాణ ద‌ర్శ‌క‌త్వంలో త‌న కూతురు ఐశ్వ‌ర్య‌ను తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌యం చేస్తూ రూపొందించిన చిత్రం సీతా ప‌య‌నం.

Seetha Payanam

యాక్ష‌న్ కింగ్ అర్జున్ స్వీయ నిర్మాణ ద‌ర్శ‌క‌త్వంలో త‌న కూతురు ఐశ్వ‌ర్య‌ను తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌యం చేస్తూ రూపొందించిన చిత్రం సీతా ప‌య‌నం. క‌న్న‌డ స్టార్ ఉపేంద్ర బంధువు నిరంజ‌న్ హీరోగా ఫ‌స్ట్ టైం సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. గ‌త ఏడాదిన్న‌గా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 13న ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌స్తోంది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌ల చేసిన పాట‌లు అంచ‌నాలు మించి మిలియ‌న్స్‌కు పైగా వ్యూస్ ద‌క్కించుకుని సినిమాకు మంచి బ‌జ్ తీసుకు వ‌చ్చాయి. ఈక్ర‌మంలో తాజాగా శ‌నివారం ఈ చిత్రం ట్రైల‌ర్ రిలీజ్ చేశారు.

ట్రైల‌ర్‌ను చూస్తే.. సినిమా అసాంతం క‌థానాయిక నేప‌థ్యంలో కుటుంబ బంధాలు, బాంధ‌వ్యాలను ట‌చ్ చేస్తూ సాగే సినిమాగా అర్థ‌మ‌వుతోంది. అంతేగాక అర్జున్‌, క‌న్న‌డ స్టార్ హీరో ధృవ్ స‌ర్జా గెస్ట్ రోల్స్ చేయ‌డం ఈ సినిమా ప్ర‌త్యేక‌త‌. ఇంకా ఈ చిత్రంలో స‌త్య‌రాజ్‌, ప్ర‌కాశ్ రాజ్ వంటి ఉద్దండులు సైతం ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. మీరూ ట్రైల‌ర్‌ను ఓ మారు చూసేయండి.

Updated Date - Feb 07 , 2026 | 08:04 PM