ఎం4ఎం హీరోయిన్ జో శర్మ స్పెషల్ చిట్ చాట్
ABN , Publish Date - May 06 , 2026 | 03:21 PM
అమెరికాలో నివసిస్తున్న తెలుగు నటి జో శర్మ ఇప్పుడు 'ఎం4ఎం' సినిమాతో తెలుగువారి ముందుకొస్తున్నారు. ఆమె కీలక పాత్ర పోషించి, నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన ఈ సినిమా మే 8న విడుదల కాబోతోంది. మోహన్ వడ్లపట్ల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ మర్డర్ మిస్టరీ గురించి జో శర్మ చెప్పిన విశేషాలు ఈ వీడియో చిట్ చాట్ లో చూడొచ్చు.
అమెరికన్ నటి జో శర్మా, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'ఎం4ఎం'. మోటీవ్ ఫర్ మర్డర్ అనేది ట్యాగ్‌లైన్. ఈ సినిమాను ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. మాక్ విన్ గ్రూప్ యు.ఎస్.ఎ. ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉంది.