తప్పు ఒప్పుకున్న ఫోక్ డ్యాన్సర్ .. అప్పుడు అది నాకు కావాలనిపించింది..
ABN , Publish Date - Aug 23 , 2026 | 07:43 PM
సోషల్ మీడియా వేదికగా విపరీతమైన వివాదానికి దారితీసిన యూట్యూబర్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌ల వ్యవహారంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
సోషల్ మీడియా వేదికగా విపరీతమైన వివాదానికి దారితీసిన యూట్యూబర్ ఈశ్వర్ సాయి (Eeswar Sai), మాధురి రాథోడ్(Madhuri Rathod) ల వ్యవహారంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ, ఆర్థిక లావాదేవీలు, ఆరోపణల వివాదం రచ్చకెక్కిన వేళ, ఈశ్వర్ సాయి సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఈశ్వర్ సాయి- మాధురి రాథోడ్ హోటల్ రూమ్ లో ఉండగా.. ఈశ్వర్ భారీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెల్సిందే. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో ఫోక్ ఇండస్ట్రీపై విమర్శలు వచ్చాయి. దీంతో చాలామంది ఫోక్ డ్యాన్సర్స్.. పర్సనల్ గొడవలను ఇండస్ట్రీలోకి తీసుకురావద్దని, పని వేరు.. పర్సనల్ వేరు అని చెప్పుకొచ్చారు. ఇక ఈశ్వర్ సాయి సైతం ఈ వివాదంపై స్పందిస్తూ తాను చేసిన తప్పును బహిరంగంగా అంగీకరించాడు. ఆవేశంలో, ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయాలు తనను తప్పుదోవ పట్టించాయని ఒప్పుకుంటూ ఒక వీడియోలో చెప్పాడు.
ఈశ్వర్ సాయి మాట్లాడుతూ.. ' ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆ క్షణంలో నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అనిపించింది. కానీ తరువాత ప్రశాంతంగా ఆలోచిస్తే నేను చేసింది ముమ్మాటికీ తప్పేనని అర్థమైంది.. నాకు, మాధురికి రెండు, మూడు నెలల నుంచే రిలేషన్ మొదలయ్యింది. నాకున్న ఒత్తిడిలో.. ఆమె సపోర్ట్ గా నిలిచింది. ఆ స్ట్రెస్.. ఆ మూమెంట్ లో నాకు అది కావాలనిపించింది. అయితే తప్పును ఒప్పుకోవడంలోనే నిజాయితీ ఉంది. భార్య ఉండగా.. ఇలాంటి పనిచేయడం తప్పే. దానిని నేను సరిదిద్దుకుంటాను. దీనికి, ఫోక్ ఇండస్ట్రీకి సంబంధం లేదు. దాని వలనే నేను బతుకుతున్నాను. అదే నాకు అన్నం పెడుతుంది. దయచేసి ఫోక్ ఇండస్ట్రీ గురించి తప్పుగా మాట్లాడొద్దని చెప్పుకొచ్చాడు.
ఇంకోపక్క మాధురి పోలీస్ కేసు పెట్టిన విషయం తెల్సిందే. తమ మధ్య కేవలం ప్రొఫెషనల్ సంబంధం మాత్రమే కాకుండా ప్రేమ బంధం కూడా ఉందని, అయితే కాలక్రమేణా నమ్మకద్రోహం, ఆర్థికపరమైన మోసాలు చోటుచేసుకున్నాయని ఆరోపించింది. యూట్యూబ్ వీడియోల ద్వారా వచ్చిన సంపాదన, ఆర్ధిక లావాదేవీలలో స్పష్టత లేకపోవడం, ఈశ్వర్ సాయి ప్రవర్తన వల్ల తాను తీవ్రంగా మోసపోయానని చెప్పుకొచ్చింది. మాధురి రాథోడ్ తీవ్రస్థాయిలో చేసిన ఆరోపణలు, లీగల్ నోటీసులు మరియు నెటిజన్ల నుంచి వ్యక్తమైన విమర్శల నేపథ్యంలో ఈశ్వర్ సాయి చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.