ప్రెష్ కథతో 'ఏంటో అంతా సరికొత్తగా..'

ABN , Publish Date - Mar 30 , 2026 | 06:31 PM

శ్రీరామ్ నిమ్మల, హర్షిత జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'ఏంటో అంతా సరికొత్తగా'. రాజ్ బోను దర్శకత్వంలో రాము ఎం నిర్మిస్తున్నారు.


శ్రీరామ్ నిమ్మల(Sriram Nimmala), హర్షిత జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'ఏంటో అంతా సరికొత్తగా' (Ento antha sarikothaga). రాజ్ బోను దర్శకత్వంలో రాము ఎం నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను దర్శకుడు శైలేష్ కొలను విడుదల చేశారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ 'పోస్టర్ చూడగానే  ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. టైటిల్ కూడా కొత్తగా, ఆకర్షణీయంగా ఉంది. ప్రస్తుతం ప్రేక్షకులు కొత్త కంటెంట్ ను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ సినిమా కూడా అదే దిశలో మంచి ప్రయత్నంగా కనిపిస్తుంది. టీమ్ అంతా కొత్త ఎనర్జీతో పనిచేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది' అని అన్నారు.  షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని నిర్మాత వెల్లడించారు.ఈ చిత్రానికి సంగీతం రిషి.ఎం, సినిమాటోగ్రఫీ వేణు కొత్తకోట, ఎడిటింగ్ హరీష్ జె.ఆర్ కృష్ణ అందిస్తున్నారు.

Updated Date - Mar 30 , 2026 | 07:00 PM