యాదిగాని పెళ్లిలో ఊరంతా లొల్లి లొల్లి .. పెళ్లి సాంగ్ అదిరింది
ABN , Publish Date - Jun 29 , 2026 | 12:58 PM
ఇటీవల పాపం ప్రతాప్ సినిమాతో ప్రేక్షకుల ఎదుటకు వచ్చిన తిరువీర్ ఇప్పుడు ఓ సుకుమారి అంటూ పలకరించేందుకు రెడీ అయ్యాడు.
ఇటీవల పాపం ప్రతాప్ సినిమాతో ప్రేక్షకుల ఎదుటకు వచ్చిన తిరువీర్ (Thiruveer) ఇప్పుడు ఓ సుకుమారి (Oh Sukumari) అంటూ పలకరించేందుకు రెడీ అయ్యాడు. ఔట్ అండ్ ఔట్ తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ద్వారా భరత్ దర్శన్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తుండగా ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన పాట, టీజర్.. సినిమాపై మంచి బజ్ తీసుకు రాగా తాజాగా సోమవారం ఈ సినిమా నుంచి యాదిగాని పెళ్లిలో ఊరంతా లొల్లి లొల్లి (YaadhiGani Pelli) అంటూ సాగే హుషారైన లిరికల్ వీడియోను విడుదల చేశారు.
ఈ పాటకు దర్శకుడు భరత్ దర్శన్ స్వయంగా సాహిత్యం అందించగా భరత్ మాచిరాజు (Bharath Manchiraju) సంగీతంలో ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు, గాయకుడు జెస్సీ గిఫ్ట్ (Jassie Gift) ఆలపించాడు. ఇక పాట విషయానికి వస్తే 3 నిమిషాల 45 సెకండ్లు ఉన్న ఈ గీతం ఆసాంతం సాహిత్యం కన్నా మ్యూజిక్ తోనే సాగడం విశేషం. తెలంగాణలో జరిగే పెళ్లి ...ఈ సందర్భంగా జరిగే బరాత్, సంబురాలు అన్నీ కళ్లకు కట్టినట్లు చూపించారు. మీరూ ఈ వీడియోపై ఓ లుక్ వేయండి మరి.