యదార్థ ఘటనలతో.. ‘సర్కార్ బాయి’
ABN , Publish Date - Apr 10 , 2026 | 07:17 AM
శ్రీరామ్ నిమ్మల, సాయి కీర్తన జంటగా తెలంగాణ సామాజిక నేపథ్యంతో రాబోతున్న కొత్త చిత్రం ‘సర్కార్ బాయి’.
శ్రీరామ్ నిమ్మల, సాయి కీర్తన జంటగా తెలంగాణ సామాజిక నేపథ్యంతో రాబోతున్న కొత్త చిత్రం ‘సర్కార్ బాయి’. లారా దర్శకత్వంలో తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురువారం సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారి దాస్య నాయక్ క్లాప్ కొట్టగా, తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. తొలి సన్నివేశానికి లారా దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా లారా మాట్లాడుతూ ‘1985లో జరిగిన నీటి సంఘటనలు, కుల వివక్ష వంటి అంశాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం’ అని చెప్పారు. ప్రజల సమస్యలను ప్రతిబింబించే కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ పొందుతుందనే నమ్మకాన్ని మూవీ యూనిట్ వ్యక్తం చేసింది. బాహుబలి ప్రభాకర్, నాగ మహేష్, దిల్ రమేష్, చలాకీ చంటి, చిట్టిబాబు, శివాని రెడ్డి, నుపూర్ ముఖర్జీ, అతిధి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మిగిలిన నటీనటులను త్వరలో ఖరారు చేసి, ఈ నెలలోనే చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
