Winter: కశ్మీర్ లో జరిగిన యధార్థ సంఘటన నేపథ్యంలో..

ABN , Publish Date - Feb 03 , 2026 | 09:30 AM

రామ్ (Ram), ఆదిత్య సూరజ్ సింగ్, కుసుమ చందక, శశికళ (Sashikala), శ్రీజిత ఘోష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'వింటర్'. 

రామ్(Ram), ఆదిత్య సూరజ్ సింగ్, కుసుమ చందక, శశికళ (Sashikala), శ్రీజిత ఘోష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'వింటర్'. క్రిసెంట్ సినిమా, టీఎస్ఆర్ మేకర్స్ పతాకంపై  రియాజ్ అహ్మద్, టి. శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ‘రాచరికం’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సురేష్ లంకలపల్లి  దర్శకత్వం వహిస్తున్నారు. రిజ్వాన్ అలీ విలన్‌గా తెరకు పరిచయం కానున్నారు. 

కశ్మీర్ లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న సినిమా ఇది. తాజాగా పూజ కార్యక్రమాలతో ఈ సినిమా మొదలైంది.  సినిమా బాగా రావాలని, షూటింగ్ సజావుగా సాగాలని చిత్రం బంధం ఆకాంక్షించింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం,   టెక్నికల్ టీంకు సంబంధించిన వివరాలను ప్రకటించనున్నారు. 

Updated Date - Feb 03 , 2026 | 10:01 PM