Mana Shankara Varaprasad Garu: సంక్రాంతి సెంటిమెంట్ తో ఆ ముగ్గురూ..

ABN , Publish Date - Jan 05 , 2026 | 09:25 PM

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), విక్టరీ వెంకటేశ్ (Venkatesh), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కి సంక్రాంతి పండగ అంటే ఓ సెంటిమెంట్. ఈ సీజన్‌లో వచ్చిన వీళ్ళ సినిమాలు మంచి విజయాలే సాధించాయి.

Mana Shankara Varaprasad Garu

Mana Shankara Varaprasad Garu: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), విక్టరీ వెంకటేశ్ (Venkatesh), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కి సంక్రాంతి పండగ అంటే ఓ సెంటిమెంట్. ఈ సీజన్‌లో వచ్చిన వీళ్ళ సినిమాలు మంచి విజయాలే సాధించాయి. దీంతో ఈ ముగ్గురి కాంబోలో సంక్రాంతికి వస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు (Mana Shanakara Varaprasad Garu) ' పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ నటించిన ఈ మెగా ఎంటర్టైనర్ ను హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించారు. జనవరి 12న 'మన శంకరవరప్రసాద్ గారు' జనం ముందుకు రానున్నారు.

చిరంజీవి పొంగల్ మూవీస్ లో కొన్ని, వెంకటేశ్ సంక్రాంతి చిత్రాల్లో కొన్ని సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. అలాగే వారిద్దరికీ చేదు రుచి చూపించిన చిత్రాలూ లేకపోలేదు. అయితే ఇప్పటి దాకా సంక్రాంతికి రిలీజైన అనిల్ రావిపూడి సినిమాలన్నీ బంపర్ హిట్స్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో చిరు, వెంకీ, అనిల్ కాంబోలో వస్తోన్న 'మన శంకరవరప్రసాద్ గారు'పై తెలుగునాట సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా ట్రైలర్ ఎంటర్టైనింగ్‌గా, మాస్‌గా ఉండటంతో బ్లాక్‌బస్టర్ వైబ్స్ స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి.

ట్రైలర్‌లో చిరంజీవి వింటేజ్ అవతారంలో కనిపించారు. చాలా ఏళ్ళ తర్వాత ఫుల్ ఫన్, యాక్షన్ మిక్స్ చేసిన రోల్‌లో మెగాస్టార్ ఆకట్టుకున్నారు. భీమ్స్ సిసిరోలియో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ 'గ్యాంగ్ లీడర్' వైబ్స్ ఇస్తూ చిరు బాడీ లాంగ్వేజ్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయింది . నయనతారతో చిరు మధ్య రొమాన్స్, మ్యారేజ్ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు ఇవన్నీ అనిల్ స్టైల్‌లో సరదాగా సాగాయి. ట్రైలర్ చివరిలో వెంకటేశ్ హెలికాప్టర్ ఎంట్రీ బిగ్ బూస్ట్ ఇచ్చింది. ప్రస్తుతం వీరు ముగ్గురు సంక్రాంతి సెంటిమెంట్ నే నమ్ముకున్నారు. మరి ఈ సెంటిమెంట్ వారికి కలిసొస్తుందా.. లేదా అనేది తెలియాలంటే జనవరి 12 వరకు ఆగాల్సిందే.

Updated Date - Jan 05 , 2026 | 09:25 PM