సామ్.. బంగారం పరిస్థితి ఏంటో
ABN , Publish Date - May 01 , 2026 | 06:34 PM
ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే.. అన్నట్లు ఉంది సమంత (Samantha) పరిస్థితి. డైరెక్టర్ రాజ్ నిడిమోరుని వివాహం చేసుకున్నాకా.. సమంత నటించిన చిత్రం మా ఇంటి బంగారం (Maa Inti Bangaram).
ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే.. అన్నట్లు ఉంది సమంత (Samantha) పరిస్థితి. డైరెక్టర్ రాజ్ నిడిమోరుని వివాహం చేసుకున్నాకా.. సమంత నటించిన చిత్రం మా ఇంటి బంగారం (Maa Inti Bangaram). ఓ బేబీ లాంటి హిట్ సినిమా తరువాత సామ్ - నందిని రెడ్డి కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే మా ఇంటి బంగారం సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మే 15 న మా ఇంటి బంగారం రిలీజ్ కానుంది. స్టార్ హీరోయిన్ సమంత సినిమా అంటే ఏ రేంజ్ లో బజ్ బన్తుందో అందరికీ తెల్సిందే. కానీ, ఈసారి మాత్రం సామ్ సినిమాకు అంతగా బుజ్ దక్కలేదు. సినిమా మరో 15 రోజుల్లో రిలీజ్ ఉన్నా సామ్ సైలెంట్ గా ఉండడం మరిన్ని అనుమానాలు రేకెత్తించాయి. మా ఇంటి బంగారం వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. అందుకే సామ్ ప్రచారాలు మొదలుపెట్టకుండా సైలెంట్ గా ఉన్నారని టాక్ వచ్చింది.
జూన్ 4 న టాక్సిక్ వాయిదా పడడంతో ఆ డేట్ న బంగారం వస్తుందని చెప్పుకొచ్చారు. కానీ, ఆ డేట్ ని పెద్ది లాక్ చేయడంతో సామ్ పరిస్థితి అటుఇటు కాకుండా పోయింది. ఇప్పుడు సామ్ కు వేరే ఆప్షన్ లేదు. వస్తే అనుకున్న టైమ్ మే 15 న రావాలి. లేదు అంటే జూన్ మిడ్ వీక్ కి వెళ్ళిపోవాలి. జూన్ 4 న పెద్ది వస్తే.. జూన్ 26 న లెనిన్ వస్తుంది. ఈ మధ్యలో బంగారం రావాలి. మరి సామ్ ఎలాంటి అడుగు వేస్తారో చూడాలి.