Kalki 2: కల్కి 2 లో దీపికా స్థానంలో వచ్చేది ఆమేనా..
ABN , Publish Date - Jan 28 , 2026 | 05:44 PM
ఇండియన్ సినిమా చరిత్రలో కల్కి 2898AD (Kalki 2898AD) ఒక టెక్నికల్ వండర్ అనే చెప్పాలి. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది.
Kalki 2: ఇండియన్ సినిమా చరిత్రలో కల్కి 2898AD (Kalki 2898AD) ఒక టెక్నికల్ వండర్ అనే చెప్పాలి. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. అయితే ఇప్పుడు అందరి కళ్లు ఈ సినిమా సీక్వెల్‌పైనే ఉన్నాయి. మేకర్స్ ఈ రెండో భాగం కోసం చేస్తున్న కసరత్తులు చూస్తుంటే.. అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కల్కి 2898AD ఫస్ట్ పార్ట్‌లో సుమతి పాత్ర చుట్టూనే మొత్తం కథ తిరిగింది. ఆ పాత్రలో దీపికా పదుకొణే తన నటనతో మెప్పించారు. అయితే కొన్ని రోజుల క్రితం సీక్వెల్ నుంచి దీపికా తప్పుకున్నట్లుగా వైజయంతీ మూవీస్ అఫీషియల్‌గా ఎనౌన్స్ చేసింది. ఇప్పుడా స్థానంలోకి మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఎంట్రీ ఇస్తుందనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వార్తతో సినిమాపై ఉన్న హైప్ ఒక్కసారిగా డబుల్ అయిపోయింది. ఈ సినిమాకు సాయి పల్లవి పేరు తోడవడమే ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కథను తన భుజాల మీద నడిపించగల సత్తా ఆమెకు ఉంది. సుమతి పాత్ర కల్కి చిత్రానికి గుండెకాయ వంటిది. ఆ పాత్రలో ఉండే లోతును, ఎమోషన్‌ను పండించాలంటే ఖచ్చితంగా ఒక గొప్ప నటి అవసరం. గతంలో దీపికా ఆ పాత్రకు న్యాయం చేసినా.. ఇప్పుడు సాయి పల్లవి ఆ బాధ్యతను తీసుకోవడం వల్ల కథకు ఒక కొత్త కళ వస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. తన నేచురల్ యాక్టింగ్‌తో ఆమె ఆ క్యారెక్టర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయం.
సాయి పల్లవి కెరీర్ చూస్తే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఆమె ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా సరే వదులుకుంటారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో జునైద్ ఖాన్ సరసన ఏక్ దిన్ చిత్రంలో నటిస్తూనే, ఇండియన్ సినిమాలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణలో సీతమ్మగా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలాంటి టైంలో కల్కి-2 లో సుమతి పాత్రకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే.. ఆ క్యారెక్టరైజేషన్ ఎంత బలంగా ఉండనుందో ఊహించుకోవచ్చు. వైజయంతీ మూవీస్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్‌లో సాయి పల్లవి కనిపించడం సినిమాతో పాటు, ఆమె కెరీర్‌కు కూడా మంచి బూస్టప్ అని చెప్పొచ్చు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముంది అనేది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించేవరకు వేచిచూడాల్సిందే.