పెద్ది టీమ్‌లో టెన్షన్..  ఆలస్యమే కారణమా 

ABN , Publish Date - Feb 26 , 2026 | 11:39 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన తర్వాత చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'పెద్ది'. ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బుచ్చిబాబు సాన మళ్లీ మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ (Ram Charan). గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన తర్వాత చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'పెద్ది' (Peddi). ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బుచ్చిబాబు సాన మళ్లీ మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, కన్నడ సెన్సేషన్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏ ఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే సోషల్ మీడియాను ఊపేస్తోంది. కానీ, అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో.. ఇప్పుడు పెద్ది టీమ్‌ను ఒక పెద్ద సమస్య వేధిస్తోంది. అనుకున్న టైమ్‌కి పెద్ది రిలీజ్‌ అవుతుందా లేదా అని..?

నిజానికి ఈ సినిమా మొదలై దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. మరికొన్ని రోజుల్లో సినిమా థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా.. ఇంకా చాలా షూటింగ్ పెండింగ్‌లో ఉందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అందరికీ ఎరుకైన విషయమేమిటంటే.. బుచ్చిబాబు  ప్రతి సీన్‌ను చాలా పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేస్తారు. అయితే, ఆ పర్ఫెక్షనే ఇప్పుడు సినిమా లేట్ అవ్వడానికి కారణం అవుతోందా అన్న సందేహాలు మొదలయ్యాయి. సాధారణంగా ఒక సినిమా రిలీజ్‌కు రెండు నెలల ముందు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావాలి. కానీ 'పెద్ది' విషయంలో టాకీ పార్ట్ ఇంకా బ్యాలెన్స్ ఉందట. అంతేకాకుండా సినిమాలోని కీలకమైన ప్రమోషనల్ సాంగ్ షూటింగ్ కూడా ఇంకా జరగలేదు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఒక స్టార్ హీరోయిన్‌తో ప్లాన్ చేసిన స్పెషల్ ఐటమ్ సాంగ్ కూడా ఇంకా షూట్ చేయాల్సి ఉందట.



మరోవైపు ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ తన పనిలో వేగం పెంచారు. ఫస్ట్ హాఫ్‌కు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను ఆయన ఇప్పటికే లాక్ చేశారు. చికిరి చికిరి సాంగ్ తెచ్చిన పాజిటివ్ వైబ్స్‌ను కంటిన్యూ చేయాలని రెహమాన్ కష్టపడుతున్నారు. కానీ షూటింగ్ పూర్తి కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం ఏం చేయగలరు..? ఇటు రెహమాన్ వర్క్ స్పీడ్.. అటు షూటింగ్ పెండింగ్.. ఈ రెండింటి మధ్య డైరెక్టర్ బుచ్చిబాబు సన తీవ్రమైన ప్రెషర్ అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి పెద్ది మార్చి నెలలోనే రిలీజ్‌ కావాల్సి ఉంది. షూటింగ్‌ అనుకున్న టైంకి పూర్తి కాదనే ఉద్ధేశ్యంతో ఈసినిమాను ఒక నెల రోజులు పోస్ట్‌పోన్ చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే.. ఆ నెల రోజుల సమయం కూడా సరిపోయేలా లేదని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మెగా ఫ్యాన్స్ మాత్రం చరణ్‌ను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ ఈ సినిమా కోసం మేకోవర్ అయిన విధానం.. ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే సినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడం ఖాయంగా కనిపిప్తుంది. కానీ ఈ షూటింగ్ ఆలస్యం కావడం వల్ల ప్రమోషన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. ఒకవైపు షూటింగ్ పూర్తి చేయాలి.. మరోవైపు భారీ ఎత్తున ప్రమోషన్స్ ప్లాన్ చేయాలి. ఈ రెంటినీ బుచ్చిబాబు ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి.

Updated Date - Feb 26 , 2026 | 12:22 PM