ఇంత జరిగాక.. జాన్వీ ఆ పని చేస్తుందా

ABN , Publish Date - Jun 06 , 2026 | 09:33 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పెద్ది (Peddi) చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలై థియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెల్సిందే.

Janhvi Kapoor

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పెద్ది (Peddi) చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలై థియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెల్సిందే. అయితే ఈ సినిమా రిజల్ట్ పక్కన పెడితే, హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పై ఎక్కువ నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యింది. సినిమాలో ఆమె పాత్ర కేవలం అందాల ఆరబోతకు, పాటలకే పరిమితమైందని, కథలో పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రను ఎంచుకుందని నెటిజన్లు మండిపడుతున్నారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ మాస్ ఎమోషనల్ డ్రామాలో జాన్వీ నటన అస్సలు సెట్ అవ్వలేదని, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు పెద్ద మైనస్ పాయింట్ అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు.


అంతేకాకుండా జాన్వీ వేస్ట్ అని చెప్పిన ఒక పోస్ట్ కి ఆమె లైక్ చేయడం పెద్ద వివాదానికి దారితీసింది. డబ్బు కోసం, పేరు కోసం ఇలాంటి పాత్రలను ఎంచుకుంటుందని ఫైర్ అవుతున్నారు. అయితే హీరోయిన్లు మాత్రం జాన్వీకి సపోర్ట్ గా నిలబడుతున్నారు. ఇప్పటివరకు జాన్వీ ఈ విషయమై స్పందించింది లేదు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం అందరి మనస్సులో మెదులుతున్న ఏకైన ప్రశ్న.. ఇంత జరిగాకా పెద్ది పోస్ట్ ప్రమోషన్స్ లో పాల్గొంటుందా.. ? ఇంతటి నెగిటివిటీని మూటగట్టుకున్నాక జాన్వీ కపూర్ పెద్ది పోస్ట్-రిలీజ్ ప్రమోషన్స్‌కు లేదా సక్సెస్ మీట్స్‌కు హాజరవుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.


ఇంటర్వ్యూకి వస్తే ఖచ్చితంగా జాన్వీ చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. సాధారణంగా బాలీవుడ్ స్టార్స్ తాము నటించిన సౌత్ సినిమాలకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పుడు ప్రమోషన్స్ నుంచి తప్పుకుంటారు. ఇప్పుడు జాన్వీ కూడా అదే చేస్తుందా.. ? లేక సినిమా కోసం నిలబడుతుందా.. ? అనేది మిస్టరీగా మారింది. అయితే చిత్ర యూనిట్ అంతర్గత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సౌత్ మార్కెట్‌లో తన పట్టును నిలుపుకోవడానికి ఈ ప్రాజెక్ట్‌ను చాలా కీలకంగా భావించిన జాన్వీ.. థియేటర్ రన్ ముగిసేలోపు వీలైనంత వరకు కలెక్షన్లను రాబట్టేందుకు రామ్ చరణ్‌తో కలిసి ఆమె కొన్ని ప్రత్యేక ఇంటర్వ్యూలలో పాల్గొనడానికి అంగీకరించిందట. దానికోసం రెమ్యూనరేషన్ కూడా తీసుకుందని టాక్. నెగిటివ్ కామెంట్స్ వస్తున్నప్పటికీ, ప్రొఫెషనల్‌గా నిలబడి సినిమాను ప్రమోట్ చేయడానికే ఆమె మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Jun 06 , 2026 | 09:42 PM