మౌళి ఎవడు.. ఎవడికి తెలుసు
ABN , Publish Date - Oct 04 , 2026 | 09:13 PM
'#90s' వెబ్ సిరీస్, ఆ తర్వాత వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో తనదైన మార్క్ కామెడీ టైమింగ్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగాడు యంగ్ హీరో మౌళి (మౌళి తనూజ్ ప్రశాంత్). వరుస విజయాలతో ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మౌళి, ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ‘దొంగ నా కొడుకు’ అనే క్రైమ్ కామెడీ సినిమాలో నటిస్తున్నాడు.
'#90s' వెబ్ సిరీస్, ఆ తర్వాత వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో తనదైన మార్క్ కామెడీ టైమింగ్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగాడు యంగ్ హీరో మౌళి (Mouli)(మౌళి తనూజ్ ప్రశాంత్). వరుస విజయాలతో ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మౌళి, ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ‘దొంగ నా కొడుకు’ అనే క్రైమ్ కామెడీ సినిమాలో నటిస్తున్నాడు. అయితే, ఇటీవల ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మౌళి ప్రస్తావన రాగా, యాంకర్ మాట్లాడిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన మిథిలేష్ రెడ్డి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. హౌస్‌లోకి అడుగుపెట్టిన రెండో రోజే ఏకంగా రూ. 15 లక్షల క్యాష్ ప్రైజ్ ఆఫర్‌కు టెంప్ట్ అయ్యి, ఆ డబ్బుతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. ఈ క్రమంలో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక మిథిలేష్ ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో సదరు యాంకర్ మాట్లాడుతూ, కాస్ట్/సామాజిక వర్గం ప్రస్తావనను తీసుకువచ్చారు. ఆ సందర్భంలో మౌళి ఉన్నాడుగా.. అని అనగా, సదరు యాంకర్ తృణీకార భావంతో స్పందిస్తూ.. 'మౌళి ఏముంది.. లిటిల్ హార్ట్స్ తరువాత కనిపించాడా..? ఆ స్టోరీ అతనికి సెట్ అయ్యింది.. అయ్యిపోయింది ఇంకా. మౌళి అనేవాడు ఎవడికి గుర్తున్నాడు..? ఒక సినిమా రాకపోతే మౌళి ఎవడు మళ్ళీ పెద్ద పెద్ద స్టార్ హీరోలనే గుర్తుపెట్టుకోరు ఇక్కడ.. మౌళి, బాలి, జాలీ ఏం ఉండదు ఇక్కడ.. సక్సెస్ ఉన్నప్పుడే గుర్తుంటారు అని చెప్పుకొచ్చాడు.
ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగి, వరుస హిట్లతో ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఒక ప్రామిసింగ్ యంగ్ హీరోని ఉద్దేశించి యాంకర్ ఆ విధంగా మాట్లాడడం పట్ల నెటిజన్లు, సినీ ప్రియులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో కష్టపడి పైకి వస్తున్న యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించాల్సింది పోయి, ఇంటర్వ్యూలలో ఇలాంటి చిన్నచూపు వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మిథిలేష్ ఇంటర్వ్యూకి సంబంధించిన ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుండగా, సదరు యాంకర్ తీరుపై మౌళి అభిమానులు మరియు నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.