విశ్వనాథ్ అండ్ సన్స్.. ఏం పిల్లరా బాబు.. పోవడం లేదు మైండ్ లో నుంచి

ABN , Publish Date - Sep 12 , 2026 | 06:16 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మలయాళ బ్యూటీ మమితా బైజు కాంబినేషన్‌లో తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్(Vishwanath & Sons).

Mamitha Baiju

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya), మలయాళ బ్యూటీ మమితా బైజు (Mamitha Baiju) కాంబినేషన్‌లో తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్(Vishwanath & Sons). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడ. ఆగస్టు 14న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సంచలన విజయం నమోదు చేసుకుంది.


థియేట్రికల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం, సెప్టెంబర్ 11 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కుటుంబ భావోద్వేగాలు, ప్రేమ, వినోదం మేళవింపుగా రూపొందిన ఈ చిత్ర కథ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. థియేటర్లలో మిస్ అయిన సినీ ప్రియులు ఇప్పుడు ఓటీటీలో ఈ చిత్రాన్ని చూస్తూ విశేషంగా ఆదరిస్తున్నారు.


అయితే ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా ఈ సినిమాలో కథానాయికగా నటించిన మమితా బైజు ఎక్స్‌ప్రెషన్స్ పైనే తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. మ్యాడీ అనే ఎంతో క్యూట్ అండ్ బబ్లీ పాత్రలో ఆమె అద్భుతంగా ఒదిగిపోయిందని ప్రేక్షకులు కొనియాడుతున్నారు. సినిమాలో ఆమె ఇచ్చిన చిన్న చిన్న హావభావాలు, ముద్దు ముద్దుగా చేసే మేనరిజమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి సన్నివేశంలోనూ ఆమె క్యూట్‌నెస్‌తో సీన్‌ను డామినేట్ చేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఏం పిల్లరా బాబు.. పోవడం లేదు మైండ్ లో నుంచి అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.


మరోవైపు కథానాయకుడిగా సూర్య కూడా తన నటనతో మరోసారి మెప్పించాడు. సంజయ్ విశ్వనాథ్ అనే పాత్రలో ఆయన చూపించిన పరిణతి, ఎమోషనల్ పండించిన తీరు సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. సూర్య-మమితా మధ్య వచ్చే కెమిస్ట్రీ, సన్నివేశాల్లో వారిద్దరి టైమింగ్ నెటిజన్లను కట్టిపడేస్తోంది. ఓటీటీలోనూ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం రాబోయే రోజుల్లో డిజిటల్ వేదికపై మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Updated Date - Sep 12 , 2026 | 06:16 PM