Vishwambhara: విశ్వంభరకు లైన్ క్లియర్ అయినట్టే..
ABN , Publish Date - May 02 , 2026 | 09:03 PM
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), త్రిష (Trisha) జంటగా వశిష్ఠ (Vassishta) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం విశ్వంభర (Vishwambhara).
Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), త్రిష (Trisha) జంటగా వశిష్ఠ (Vassishta) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం విశ్వంభర (Vishwambhara). దాదాపు మూడేళ్ళ క్రితం మొదలైన ఈ చిత్రం ఇప్పటివరకు రిలీజ్ కి నోచుకోలేదు. వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తోంది. కొన్నిసార్లు పెద్ద సినిమాలు అడ్డుపడ్డాయని, మరికొన్నిసార్లు విఎఫ్ఎక్స్ లేట్ అయ్యిందని వార్తలు వచ్చాయి. ఇక సమ్మర్ లో అయినా చిరు సందడి చేస్తారేమో చూస్తే పెద్ది అడ్డు తగిలింది. ఇక చివరగా జూలై 10 న విశ్వంభర రానున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.
అయితే ఏప్రిల్ లో రావాల్సిన పెద్ది జూన్ 25 కి షిఫ్ట్ అయితే.. రెండు వారాల్లో తండ్రీకొడుకుల సినిమాలు రిలీజ్ కావడం కష్టమని.. చిరు ఆగస్టు కి షిఫ్ట్ అవ్వాలని అనుకోరు. కానీ, ఈలోపే టాక్సిక్ వాయిదా పడడంతో ఆ డేట్ ని పెద్ది లాక్ చేయడంతో విశ్వంభరకు లైన్ క్లియర్ అయ్యినట్లే అని చెప్పొచ్చు. ఎలాగూ జూన్ 26 న లెనిన్ కూడా వచ్చేస్తోంది. జూలై 10 కి చిరుకు పెద్దగా పోటీ లేనట్లే.
విశ్వంభర రావడానికి జూలై 10 కరెక్ట్ టైమ్. ఇంతకుమించిన మంచి డేట్ మళ్ళీ చిరుకు దొరకదు అంటే అతిశయోక్తి లేదు. కానీ, ఆ సమయానికి వస్తుందా.. ? లేదా అనేది డౌట్. ఎందుకంటే విశ్వంభర షూటింగ్ ని పూర్తిచేసుకున్నా.. విఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తికాలేదని తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ మీద మేకర్స్ చాలా ఖర్చుపెడుతున్నారు. చిత్రబృందం మొత్తం సంతృప్తి చెందితేనే సినిమాను రిలీజ్ చేయనున్నారట. అందుకే ఈ డేట్ కూడా అనుమానమే అని ఇండస్ట్రీ వర్గాల టాక్. మరి చిరు.. ఇంత మంచి డేట్ ని వదులుకుంటారా.. ? లేక బాక్సాఫీస్ ని షేక్ ఆడించడానికి వచ్చేస్తారా.. ? అనేది తెలియాల్సి ఉంది.