విరోష్ రిసెప్షన్.. ఏం ఉన్నారబ్బా .. ఫిదా అంతే

ABN , Publish Date - Mar 04 , 2026 | 09:43 PM

విజయ్ దేవరకొండ (Vijay Devrakonda).. ప్రస్తుతం ఇండస్ట్రీ మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరు ఆయన గురించే మాట్లాడుకొంటున్నారు అంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా ప్రతి సెలబ్రిటీ పెళ్ళిలో వధువు హైలైట్ అవుతుంది. కానీ విజయ్- రశ్మిక (Rashmika) పెళ్ళిలో వరుడు మాత్రమే హైలైట్ గా నిలిచారు.

Virosh

విజయ్ దేవరకొండ (Vijay Devrakonda).. ప్రస్తుతం ఇండస్ట్రీ మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరు ఆయన గురించే మాట్లాడుకొంటున్నారు అంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా ప్రతి సెలబ్రిటీ పెళ్ళిలో వధువు హైలైట్ అవుతుంది. కానీ విజయ్- రశ్మిక (Rashmika) పెళ్ళిలో వరుడు మాత్రమే హైలైట్ గా నిలిచారు. అందుకు కారణం ఆయన ధరించిన దుస్తులే. అసలు పెళ్ళికొడుకు ఆభరణాలు ధరిస్తాడా.. ? అని అనుకొనేవారందరికీ విజయ్ పెళ్ళి లుక్ ఒక షాక్. రాజుల కాలంలో రాజులు ఇలానే ఉండేవారా అని అనిపించేలా చేశారు. పెళ్ళి కదా కేవలం అక్కడే ఇలాంటి లుక్ తో కనిపిస్తారు. మిగతా ఈవెంట్స్ లో నార్మల్ గా కనిపిస్తారు అనుకున్నారు. కానీ, ప్రతి ఈవెంట్ లో విరోష్ ఎంతో ప్రత్యేకంగా కనిపించి అందరిని ఆశ్చర్యపరుస్తూనే వస్తున్నారు.

ముఖ్యంగా విజయ్ లుక్.. పెళ్ళి దగ్గర నుంచి ఊరికి వెళ్లడం, సత్యనారాయణ వ్రతం, ఫ్యాన్స్ మీట్, ప్రెస్ మీట్, రిసెప్షన్.. ఇలా ప్రతిదాంట్లో కూడా ఎక్కడా సాంప్రదాయాన్ని వదలకుండా తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించారు. రశ్మిక సైతం.. పెద్ద పెద్ద డిజైనర్ చీరలు, ఫ్యాషన్ ఫాలో అవ్వకుండా చాలా సింపుల్ గా ఒక తెలుగింటి కోడలు ఎలా అయితే కనిపిస్తుందో అలాగే కనిపించి అందరి ప్రశంసలను అందుకున్నారు.

ఇక రిసెప్షన్ కి కూడా విరోష్ సాంప్రదాయాన్ని వదలలేదు. రెడ్ కలర్ సబ్యసాచి చీరలో రశ్మిక కనిపించగా.. వైట్ అండ్ వైట్ పట్టు పంచెతో విజయ్ ఎంతో హుందాగా కనిపించారు. నిజంగా వీరిద్దరి లుక్ మాత్రం చాలామంది మరిచిపోయిన తెలుగు సాంప్రదాయాలను గుర్తుచేస్తోంది అని చెప్పొచ్చు. విరోష్ జంటను చూసి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అంత అందంగా కనిపించారు. ప్రస్తుతం విరోష్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Updated Date - Mar 04 , 2026 | 09:57 PM