అతిథులకు జపనీస్ డిన్నర్
ABN , Publish Date - Feb 24 , 2026 | 02:16 PM
ఫ్రెండ్ షిప్ అయినా, లవ్ అయినా, మ్యారేజ్ అయినా మనకంటూ ఓ మార్క్ ఉండాలి, కలకాలం నిలచిపోవాలి అనుకుంటున్నారు టాలీవుడ్ బ్యూటిపుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రశ్మిక. తమ పెళ్లి కోసం గెస్టులను ఖుషి చేసేందుకు వారు చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ హాట్ టాపిక్ ఏమిటంటే.. విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న వివాహం. 'విరోష్' పేరుతో ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లోని ఐటీసీ మెమెంటోస్ ప్యాలెస్‌లో సన్నిహితుల మధ్య వీరిద్దరి మ్యారేజ్ జరగబోతుంది. మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ హోటల్‌లో రిసెప్షన్ జరగనుంది. అయితే ఏం చేసినా తమకంటూ ప్రత్యేకత ఉండాలని కోరుకునే ఈ జంట.. పెళ్లికి వచ్చిన అతిథులకు పసందైన విందును ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఏర్పాటు చేస్తున్నారు.
విరోష్ వెడ్డింగ్‌లో జపనీస్ వంటకాలు ప్రధాన హైలైట్‌గా నిలువబోతున్నాయట. రశ్మిక మందన్న తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఫోటోలతో ఇది అర్థమవుతోంది. గోల్డెన్ క్లాత్‌తో అలంకరించిన టేబుల్‌పై బ్లష్ పింక్ లిల్లీలు, గ్రీన్ హైడ్రేంజాలు, గ్రీన్ ఆపిల్స్, క్యాస్కేడింగ్ ద్రాక్షలతో అందంగా సెట్ చేసిన టేబుల్ సెటప్ కనిపిస్తోంది. అందులో ప్రత్యేకంగా డిజైన్ చేసిన జపనీస్ మెనూ కార్డు ఉండటం ద్వారా అతిథులకు పూర్తి జపనీస్ భోజన అనుభవం అందించాలని ఈ జంట నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జపనీస్ డెలికసీస్‌ను అందించాలనుకోవడం వారి ప్రత్యేకతను తెలియజేస్తోందని భావిస్తున్నారు. ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్‌లో కూడా జపనీస్ డిన్నర్‌తో పాటు పూల్ పార్టీ, వాలీబాల్ వంటి ఫన్ యాక్టివిటీస్ ఉండబోతున్నాయట. విజయ్, రశ్మిక ఇద్దరూ ప్రతి విషయంలోనూ ఆచితూచి ప్లాన్ చేస్తూ అతిథులకు అద్భుతమైన అనుభవం కల్పించాలని స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. ఈ జపనీస్ మెనూ ఎంపికతో వారి వివాహ వేడుక మరింత యూనిక్‌గా, గ్లోబల్ టచ్‌తో కనిపిస్తోంది.
Read Also: మళ్ళీ బాలయ్య, పూరి జగన్నాథ్ కాంబో?
Read Also: పొలిటికల్ డైలాగ్‌లు.. సెటైర్లు ఉండవు.. హరీశ్‌శంకర్ క్లారిటీ..