రణబాలి.. మొన్నటివరకు అది.. ఇప్పుడు ఇది

ABN , Publish Date - Oct 09 , 2026 | 05:33 PM

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ చిత్రం రణబాలి విడుదలకు సిద్ధమవుతోంది. పెళ్లి తరువాత విజయ్ - రష్మిక నుంచి వస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

Ranabaali

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ చిత్రం రణబాలి (Ranabaali) విడుదలకు సిద్ధమవుతోంది. పెళ్లి తరువాత విజయ్ - రష్మిక నుంచి వస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ చేశారు. అయితే ఆ ప్రమోషన్స్ రివర్స్ అయ్యాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్లు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ హైప్‌ను తీసుకురావడానికి బదులుగా సోషల్ మీడియాలో నెగిటివిటీని మూటగట్టుకోవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రమోషన్ల విధానం సినిమా కంటెంట్‌పై కంటే ఇతర విషయాలపైనే ఎక్కువ ఫోకస్ అయ్యేలా చేస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.


మొన్నటికి మొన్న విజయ్ - రష్మిక ఇంటర్వ్యూలు ఇవ్వగా, అక్కడ సినిమా కథ లేదా క్యారెక్టర్ల కంటే వారిద్దరి వ్యక్తిగత ప్రేమ, పెళ్లి విషయాల గురించే ఎక్కువ హైప్ తీసుకొచ్చారు. ఆ తర్వాత ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగితే, అక్కడైనా సినిమాపై బజ్ పెరుగుతుందని అందరూ భావించారు. కానీ ఆ ఈవెంట్‌లో విజయ్ మాట్లాడిన వ్యాఖ్యలు, దానికి సంబంధించిన నెగిటివిటీనే సోషల్ మీడియాలో ఎక్కువగా హైలైట్ అయ్యాయి. దీంతో సినిమా కథ ఏంటి? విజువల్స్ ఎలా ఉన్నాయి? అనే విషయాలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.


సినిమా ప్రమోషన్లు ప్రాజెక్ట్‌కు ప్లస్ అవ్వాల్సింది పోయి, ఇలా పక్కదారి పట్టడం మూవీ టీమ్‌కి తలనొప్పిగా మారింది. కేవలం బజ్ కోసం ఇటువంటి వివాదాలు ఉపయోగపడొచ్చేమో కానీ, థియేటర్లలో రన్ కావాలంటే కంటెంటే ముఖ్యమని కామెంట్స్ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రణబాలి హిట్ అవ్వాలంటే మొదటి రోజు వచ్చే టాక్ మీదనే పూర్తిగా ఆధారపడాల్సి ఉంటుందని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Oct 09 , 2026 | 05:33 PM