విజయ్ దేవరకొండ.. శౌర్యువ్ సినిమా షురూ

ABN , Publish Date - Apr 18 , 2026 | 01:01 PM

ప్రస్తుతం 'రణబాలి’, 'రౌడీ జనార్దన్' చిత్రాలతో బిజీగా ఉన్నారు విజయ్ దేవరకొండ. తాజాగా ఆయన మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ప్రస్తుతం 'రణబాలి’, 'రౌడీ జనార్దన్' చిత్రాలతో బిజీగా ఉన్నారు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). తాజాగా ఆయన మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'హాయ్ నాన్న' ఫేమ్ శౌర్యువ్ తో (Shouryuv) విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నారని చాలా కాలంగా  వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా   శౌర్యువ్  దర్శకత్వంలో వైరా బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను శనివారం విడుదల చేశారు.  దీనిపై 'ఇప్పుడు కనిపించే కోపమంతా ఒకప్పటి ప్రేమ' అంటూ క్యాప్షన్ ఇచ్చారు.   మైథాలజికల్ యూనివర్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న  ఈ సినిమాకు  ఇంటర్నేషల్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తుండటం విశేషం.

'హౌస్ ఆఫ్ ది డ్రాగన్', 'ఫాల్ ఔట్' వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన అలెజాండ్రో మార్టినెజ్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్, బ్యాట్ మ్యాన్ ఫరెవర్, స్నోపియర్సర్ చిత్రాల  వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ ఎరిక్ డస్ట్ర్  కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. యానిమల్, ఓం శాంతి ఓం వంటి చిత్రాలకు పనిచేసిన సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.  హేషమ్ అబ్దుల్ వాహాబ్ స్వరకర్త. తాజాగా విడుదల చేసిన పోస్టర్లో విజయ్ దేవరకొండ చేతిలో నాలుగు పెట్ డాగ్స్ ను తీసుకుని నడుచుకుంటూ వస్తుండటం, వెనక ఏడుగురు వ్యక్తులు వివిధ రకాల ఆయుధాలు చేపట్టి ఉండటం ఆసక్తి కలిగిస్తోంది.  

Updated Date - Apr 18 , 2026 | 02:55 PM