తెలుగు రాష్ట్రాలకు మంచి కోడలు వచ్చింది.. మంచిగా చూసుకోండి
ABN , Publish Date - Mar 04 , 2026 | 05:54 PM
ఎట్టకేలకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda).. రశ్మిక (Rashmika)తో ఏడడుగులు వేశారు. ఫిబ్రవరి 26 న విరోష్ వివాహం ఘనంగా జరిగింది.
ఎట్టకేలకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda).. రశ్మిక (Rashmika)తో ఏడడుగులు వేశారు. ఫిబ్రవరి 26 న విరోష్ వివాహం ఘనంగా జరిగింది. పెళ్ళి తరువాత ఈ జంట సంప్రదాయబద్ధంగా చేయాల్సిన పూజలు నిర్వహించారు. సొంతూరులో సత్యనారాయణ వ్రతం ముగించి.. హైదరాబాద్ కి తిరిగి వచ్చి మార్చి 3 న తమ అభిమానులను మీట్ అయ్యారు. వారికి స్వయంగా తమ చేతులతో వడ్డించి.. అభిమానులతోనే కలిసి భోజనం చేశారు. ఇక నేడు ఈ జంట మీడియా ఆశీస్సులను అందుకున్నారు. ప్రెస్ మీట్ పెట్టి.. కొత్త జంటను ఆశీర్వదించమని కోరారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'మా ఇద్దరి ప్రయాణంలో మీడియా ఒక భాగంగా మారింది. అప్పుడు నేను చేసిన ఇంటర్వ్యూలు నాకు చాలా ప్రత్యేకం. ఇంటర్వ్యూ అయ్యాక నేను చూసుకొనేవాడిని. జనాల్లోకి వెళ్ళిందా.. ? ఏమనుకుంటున్నారు అని. ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని.. రశ్మికతో కలిసి వచ్చాను. చాలా కొత్తగా ఉంది ఈ అనుభూతి. కొత్త లైఫ్ ని మొదలుపెడుతున్నాం.. కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటున్నాం. కానీ, ఎప్పటికీ మీరు మా హోమ్ ప్రెస్. తెలుగు ప్రెస్ వారందరూ మా ఇంటివారే. మాకు విషెస్ చెప్పినవారందరికీ కృతజ్ఞతలు. తెలుగు రాష్ట్రాలకు కొత్త కోడలు వచ్చింది. మంచిగా చూసుకోండి. మా హృదయాల్లో మీరు ఎప్పటికీ ఉంటారు' అని తెలిపారు.
రశ్మిక మాట్లాడుతూ.. 'జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెడుతున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి . మమ్మల్ని ఆశీర్వదించండి' అని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.