స్వగ్రామానికి.. విజయ్, ర‌ష్మిక‌! నూత‌న‌ గృహప్రవేశం.. విందు

ABN , Publish Date - Mar 01 , 2026 | 09:40 AM

సినీనటుడు విజయ్ దేవరకొండ ఇటీవ‌లే ర‌ష్మికను వివాహం చేసుకుని వివాహా బంధంలోకి అడుగు పెట్టిన విష‌యం తెలిసిందే.

vijay

సినీనటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఇటీవ‌లే ర‌ష్మిక (Rashmika Mandanna)ను వివాహం చేసుకుని వివాహా బంధంలోకి అడుగు పెట్టిన విష‌యం తెలిసిందే. ఆ పై హైద‌రాబాద్‌కు కూడా వ‌చ్చేసిన ఈ జంట మ‌రో రెండు రోజుల్లో జ‌రుగనున్న రిస‌ప్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్నారు.

అయితే.. అంత‌కుముందే.. విజ‌య్‌ సతీమణి రష్మికతో కలిసి స్వగ్రామం నాగర్ క‌ర్నూలు (Nagarkurnool) జిల్లా బల్మూరు మండలం, తుమ్మన్ పేట (Thummanpet)కు సోమవారం రానున్నారు. నూతన ఫామ్ హౌస్‌లో గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించ‌నున్నారు.

అనంతరం 2వేల మందికి పైగా అభిమానులకు విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేప‌థ్యంలో తుమ్మనపేటలో విజయ్ దేవరకొండ ఫామ్ హౌస్‌ను ముస్తాబు చేశారు. వివాహం అయిన తర్వాత తొలిసారి వస్తుండటంతో గ్రామస్థులు విజయ్‌, రష్మిక రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

vijay.jfif

16 పుణ్యక్షేత్రాల్లో విజయ్‌, రష్మికల అన్నదానం

వివాహ బంధంతో ఒక్కటైన విరోష్‌ (విజయ్‌ దేవరకొండ-రష్మిక మందన్న) జంట తమ కొత్త జీవితానికి ప్రజల ఆశీస్సులు కోరుతూ ఆదివారం దేశవ్యాప్తంగా 16 పుణ్య క్షేత్రాల్లో అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకునేందుకు పలు నగరాల్లో ట్రక్కుల ద్వారా మిఠాయిలను పంచిపెట్టారు.

‘మా ప్రయాణంలో, ప్రేమలో మీరంతా భాగం. భారతదేశంలో ఏ శుభకార్యమైనా, భోజనం, మిఠాయిలతోనే జరుపుతారు. అందుకే మా సంతోషాన్ని మీ అందరితో పంచుకోవడానికి స్వీట్స్‌ పంపిస్తున్నాం’ అని విజయ్‌ రష్మిక సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు.

Updated Date - Mar 02 , 2026 | 07:02 AM