విజయ్ దేవరకొండ, రశ్మిక పెళ్ళి శుభలేఖ ఇదిగో!

ABN , Publish Date - Feb 16 , 2026 | 03:25 PM

విజయ్ దేవరకొండ, రశ్మిక వివాహం ఈ నెల 26న జరుగబోతోంది. దీనిని కేవలం కుటుంబ కార్యక్రమంగా నిర్వహించబోతున్నారు. అయితే మార్చి 4న జరిగే వెడ్డింగ్ రిసెప్షన్‌కు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.

Vijay Devarakonda - Rashmika

తెలుగు స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), నేషనల్ క్రష్‌ రశ్మిక మందణ్ణ (Rashmika Mandanna) అతి త్వరలోనే పెళ్ళి పీటలు ఎక్కబోతున్నారు. ఇటీవల జరిగిన వీరి వివాహ నిశ్చితార్థంకు సంబంధించిన వార్తను వారు అధికారికంగా తెలుపలేదు. కానీ మీడియాకు మాత్రం వారి పీఆర్ టీమ్ నుండి ఫోటోలు అందాయి. ఇప్పటి వరకూ ఇటు విజయ్ దేవరకొండ అటు రశ్మిక మందణ్ణ తమ పెళ్ళిపై స్పందించలేదు.

ఒకపక్క మార్చి 6న జరుగుబోతున్న అల్లు శిరీష్‌ వివాహానికి సంబంధించిన పెళ్ళి శుభలేఖల పంపిణీ జోరందుకుంది. చిరంజీవికి పెళ్లి కార్డును అందించి, ఆ విషయాన్ని బాహాటంగానే అల్లు శిరీష్‌ సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా తెలియచేశారు. కానీ ఇటు పక్కన విజయ్ దేవరకొండ మాత్రం తన పెళ్ళి విషయంలో గోప్యత పాటిస్తున్నారు.


ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ని విజయ్ దేవరకొండ కలిసి, తన పెళ్ళికి ఆహ్వానించారు. ఆ విషయాన్ని మాత్రం మీడియాకు తెలియచేయలేదు. ఇదిలా ఉంటే... విజయ్ దేవరకొండ, రశ్మిక మందణ్ణ వివాహా ఆహ్వాన పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ నెల 26న వీరి పెళ్ళి జరుగబోతోంది. అయితే దాన్ని కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే పరిమితం చేశారు. మిగిలిన వారందరినీ మార్చి 4న హైదరాబాద్ తాజ్ కృష్ణాలో జరిగే రిసెప్షన్‌కు వీరు ఆహ్వానిస్తున్నారు. అందువల్ల వివాహం ఎక్కడ? ఎన్ని గంటలకు జరుగుతుందనే విషయాన్ని ఈ ఆహ్వాన పత్రికలో పేర్కొనలేదు.

rashmika.jfif

Updated Date - Feb 16 , 2026 | 03:29 PM