పెళ్లి అయ్యి ఏడాది కూడా కాలేదు.. విజయ్- రష్మిక వేరు కాపురం
ABN , Publish Date - Oct 02 , 2026 | 07:09 PM
టాలీవుడ్ హిట్ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మళ్లీ వార్తల్లో నిలిచారు. ఈసారి తమ సినిమాలతోనే కాకుండా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో హాట్ టాపిక్‌గా మారారు.
టాలీవుడ్ హిట్ పెయిర్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) మళ్లీ వార్తల్లో నిలిచారు. ఈసారి తమ సినిమాలతోనే కాకుండా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో హాట్ టాపిక్‌గా మారారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో వీరు ఒక అత్యంత విలాసవంతమైన లగ్జరీ విల్లాను కొనుగోలు చేసినట్లు రియల్ ఎస్టేట్ వర్గాల్లో తీవ్రంగా ప్రచారం సాగుతోంది. అల్మాస్‌గూడ-తుక్కుగూడ బెల్ట్‌లో నిర్మిస్తున్న ఫ్యూచర్ ట్రెండ్స్ - ది వ్యాలీ ప్రాజెక్ట్‌లో వీరు ఈ ప్రాపర్టీని సొంతం చేసుకున్నట్లు సమాచారం.
ఈ ప్రైమ్ విల్లా ప్రాజెక్ట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. ఇందులో ఒక్కో ప్లాట్ 1,000 చదరపు గజాలకు పైగా వైశాల్యం కలిగి ఉండి, అల్ట్రా-లగ్జరీ సదుపాయాలతో కూడిన విల్లాలను అందిస్తోంది. విమానాశ్రయానికి కేవలం కొన్ని నిమిషాల ప్రయాణ దూరంలో మాత్రమే ఉండటం, చదరపు అడుగు ధర దాదాపు రూ. 15,000 వరకు పలుకుతుండటంతో ఇది హైదరాబాద్‌లోనే అత్యంత ఖరీదైన లగ్జరీ హౌసింగ్ సెగ్మెంట్లలో ఒకటిగా నిలిచింది. తరచూ ప్రయాణాలు చేసే విజయ్-రష్మిక కొద్దిగా ఏకాంతం కోసం ఈ విల్లాని కొనుగోలు చేసినట్లు టాక్ నడుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ విల్లా విలువ 12 కోట్లు నుంచి 21 కోట్లు వరకు ఉందని తెలుస్తోంది. ఈ విల్లాను రష్మిక - విజయ్ తమకు నచ్చిన విధంగా తీర్చిదిద్దనవతున్నారట.
ఇక ఈ కొనుగోలు వార్తలు నెట్టింట ఆసక్తిని పెంచుతుండటంతో.. ఇద్దరూ తమ తల్లిదండ్రులకు దూరంగా విడిగా జీవించబోతున్నారా? అనే చర్చ కూడా మొదలైంది. పెళ్లి అయ్యి ఏడాది కూడా కాలేదు. అప్పుడే ఈ జంట వేరు కాపురం పెడుతున్నారా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై విజయ్ కానీ, రష్మిక కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కొత్త విల్లా కొనుగోలు చేసినంత వేరు కాపురం అని చెప్పలేము. ఇన్వెస్ట్‌మెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ లేదా ప్రైవేట్ వేకేషన్స్, కుటుంబ అవసరాల కోసం కూడా ఈ విల్లాని కొనుగోలు చేసి ఉండొచ్చు అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. గతంలో తాము జాయింట్ ఫ్యామిలీగా ఉండటాన్ని ఇష్టపడతామని ఇద్దరూ పలుమార్లు వెల్లడించిన నేపథ్యంలో, ప్రస్తుతానికి దీనిని కేవలం ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ అనే చెప్పవచ్చు. మొత్తానికి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్ వార్త టాలీవుడ్‌తో పాటు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సర్కిళ్లలోనూ పెద్ద ఎత్తున హాట్ టాపిక్‌గా మారింది.