శ్రీవారి సేవలో విజయ్- రష్మిక..
ABN , Publish Date - Oct 13 , 2026 | 12:23 PM
టాలీవుడ్ మోస్ట్ పాపులర్ అండ్ లవ్లీ కపుల్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
టాలీవుడ్ మోస్ట్ పాపులర్ అండ్ లవ్లీ కపుల్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి శేషవస్త్రం కప్పి, వేదాశీర్వచనం అందించగా, పండితులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
దర్శనానంతరం ఆలయం వెలుపలికి వచ్చిన ఈ జోడీని చూసేందుకు అభిమానులు, భక్తులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. విజయ్, రష్మిక ఇద్దరూ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ అందరికీ నమస్కరిస్తూ అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. విజయ్ - రష్మిక జంటగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన రణబాలి సినిమా అక్టోబర్ 16 న రిలీజ్ కి సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం భారీ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూనే వారు తిరుమల స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు సమాచారం.
రణబాలి సినిమాపై విజయ్ దేవరకొండ చాలా ఆశలు పెట్టుకున్నాడు. లైగర్ నుంచి ఇప్పటివరకు విజయ్ హిట్ ట్రాక్ ఎక్కింది లేదు. ఈ సినిమాతో ఎలాగైనా ఒక మంచి హిట్ అందుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నాడు. అందులో రష్మికతో పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం కావడంతో అభిమానులు కూడా ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రణబాలి నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరి రణబాలి విజయ్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.