విజయ్ దేవరకొండ: సొంతూరు కోసం విజయ్ అద్భుతమైన నిర్ణయాలు
ABN , Publish Date - Mar 02 , 2026 | 10:02 PM
ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన హీరో విజయ్ దేవరకొండ, ఆయన సతీమణి రష్మిక మందన్న, కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊరు తుమ్మపేటకు వెళ్లారు.
ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), ఆయన సతీమణి రష్మిక మందన్న9Rashmika Mandanna), కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊరు తుమ్మపేటకు వెళ్లారు. నాగర్ కర్నూలు జిల్లాలోని బల్మూరు మండలంలో ఉన్న తుమ్మన్ పేట విజయ్ సొంతూరు. పెళ్లైన తర్వాత తొలిసారి అక్కడికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు విజయ్ దేవరకొండ. విజయ్ కుటుంబానికి తుమ్మన్ పేట గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ గ్రామంలో ఉన్న తమ స్వగృహంలో సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకున్నారు విజయ్. స్థానిక ప్రజలందరికీ విజయ్ కుటుంబ సభ్యులు పెళ్లి విందు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ 'పుట్టిన ఊరుతో విడదీయరాని అనుబంధం ఉంది. నా తొలి పుట్టినరోజు ఇక్కడే నిర్వహించినట్లు అమ్మ చెప్పింది. నాన్న కోరిక మేరకు ఇక్కడ ఇల్లు కట్టుకున్నా. సొంత గ్రామంలో పెళ్లి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంది. మా జంటకు ఆశీస్సులు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మన గ్రామానికి చాలా మంచి పనులు చేయాలని ఉంది. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్దాం. ఈ విద్యా సంవత్సరం తుమ్మన్‌పేట ఉన్నత పాఠశాలలో 9, 10వ తరగతుల్లో మంచి మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన ఇద్దరు విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. వచ్చే ఏడాది అచ్చంపేట డివిజన్ పరిధిలో 44 పాఠశాలల్లో దీనిని అమలు చేస్తాను' అన్నారు.