తమిళంలోకి.. ఆనంద్ దేవ‌ర‌కొండ‌ ఎంట్రీ

ABN , Publish Date - Nov 18 , 2026 | 08:38 AM

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

Anand Deverakonda

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన తెలుగులో నటించిన గం గం గణేశా (Gam Gam Ganesha) చిత్రాన్ని తమిళంలోకి 'జై జై గణేశా' పేరుతో అనువాదం చేసి రిలీజ్ చేయనున్నారు. యాక్షన్, థ్రిల్లర్, కామెడీతో వినోదాత్మక చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. జేజే మూవీస్ పతాకంపై విజయ్ మాధవన్ నిర్మించే ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) హీరోగా, నయన్ సారిక (Nayan Sarika) , ప్రగతి శ్రీవాస్తవ (Pragathi Srivastav) హీరోయిన్లగా నటించారు. రాజ్ అరుణ్ ప్రతినాయకుడి పాత్ర పోషించగా ఉదయ్ బొమ్మిశెట్టి (Uday Bommisetty) దర్శకత్వం వహించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టు కునేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. వినోదా త్మక అంశాలతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం చివరి దశ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి థియేటర్లలో విడుదల చేయను న్నారు.

ఈ చిత్ర కథను దర్శక నిర్మాతలు వివరిస్తూ..'హీరో గణేష్ ధనవంతుడు కావాలని నిర్ణయించుకుంటాడు. ఆ సమయంలో ఆయనకు సుమారు రూ.7 కోట్ల విలువైన వజ్రాన్ని దొంగిలించే అవకాశం వస్తుంది. తన ప్రథకం ప్రకారం ఆ వజ్రాన్ని చోరీ చేసి గణపతి విగ్రహంలో దాచిపెడతాడు. మరోవైపు రాజకీయ నేత కిషోర్.. రుద్ర అనే నేరస్థుడి సహాయంతో గణేశ విగ్రహాల్లో దాచిన డబ్బును తీసుకెళ్ళేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే, ఆ విగ్ర హాలు అనుకోకుండా చేతుల మారుతాయి. దీంతో గణేష్ తన వజ్రం కోసం, రుద్ర తన డబ్బు కోసం అన్వేషణ ప్రారంభింస్తారు. ఆ ఇద్దరి అన్వేషణ కూడా అదే గ్రామంలో జరిగే గణేశ చతుర్ది పండుగ చుట్టూ కేంద్రీకృతమైవుం టుంది. తద్వారా ఏర్పడే గందరగోళం, ఊహించని మలుపులు, హాస్యభరిత సంఘటనలు, యాక్షన్ ప్యాక్ట్ ఘర్షణలే ఈ సినిమా ఆసక్తికర మైన కథ అని పేర్కొన్నారు.

Updated Date - Nov 18 , 2026 | 08:44 AM