టాక్ షో.. భ‌లే ఫ్లాన్ చేశారుగా! సోల్ ట్రిప్‌.. ట్రైల‌ర్‌

ABN , Publish Date - Feb 13 , 2026 | 10:11 AM

హీరో విజ‌య్ దాట్ల హోస్ట్‌గా మారి త‌న సొంత బ్యాన‌ర్ గండ‌భేరుండ ఆర్ట్స్‌పై రూపొందించిన టాక్ షో సోలో ట్రిప్.

Soul Trip

గ‌తంలో పోస్ట‌ర్, అన్వేషి వంటి సినిమాల‌తో అల‌రించిన హీరో విజ‌య్ దాట్ల (Vijay Datla) హోస్ట్‌గా మారి త‌న సొంత బ్యాన‌ర్ గండ‌భేరుండ ఆర్ట్స్‌పై రూపొందించిన టాక్ షో సోలో ట్రిప్ (Soul Trip). ఇండియాస్ ఫ‌స్ట్ ట్రావెల్ బేస్డ్ అడ్వెంచ‌ర‌స్ టాక్ షో (Travel Based Talk Show) గా పేరు సంపాదించికుంది. ఈ మొద‌టి సీజ‌న్‌లో జ‌గ‌ప‌తి బాబు, శ్రీకాంత్‌, ఆకాశ్ పూరి, అలీ, శివానీ, శివాత్మిక‌, వ‌ర్ష బొల్ల‌మ్మ వంటి టాలీవుడ్‌కు ప్ర‌ముఖ న‌టీన‌టులంద‌రితో క‌లిసి చేసిన ఈ టాక్ షో ట్రైల‌ర్ తాజాగా విడుద‌ల చేశారు. త్వ‌ర‌లోనే డిజిట‌ల్ స్ట్రీమింగ్ స్టార్ట్ అవ‌నుంది.

హోస్ట్ విజ‌య్‌.. ఒక్కో సెల‌బ్రిటీతో ప్రాచుర్యం పొందిన కులు మ‌నాలి, కూర్గ్‌, గోవా, క‌శ్మీర్‌, ల‌డ‌ఖ్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్, సిమ్లా వంటి ఏదేని ఒక‌ ప‌ర్యాట‌క ప్రాంతలో ప‌ర్య‌టిస్తారు. ఆపై అద్భుత‌మైన‌ ప్ర‌కృతి అందాల న‌డుమ వారితో ఇష్టాఘోష్టిగా మాట్లాడుతూ.. ఎలాంటి ఫిల్ట‌ర్ లేకుండా వారి మ‌న‌సులోని భావాల‌ను వెలికి తీసే టాక్ షోగా తీర్చిదిద్దిన‌ట్లు ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. మీరూ ఈ ట్రైల‌ర్‌పై ఓ లుక్కేయండి.

Updated Date - Feb 13 , 2026 | 10:15 AM