విజయ్ ఆంటోనీ.. 'బూకీ' ట్రైల‌ర్ అదిరింది

ABN , Publish Date - Feb 15 , 2026 | 07:01 PM

విజయ్ ఆంటోనీ మేన‌ల్లుడు అజయ్ దిషన్, ధనుష హీరో హీరోయిన్స్‌గా గణేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'బూకి'.

Vijay Antony

బిచ్చ‌గాడు ఫేం విజయ్ ఆంటోనీ మేన‌ల్లుడు అజయ్ దిషన్ (Ajai Dishan), ధనుష (Dhanusha) హీరో హీరోయిన్స్‌గా గణేష్ చంద్ర (Ganesh Chandra) దర్శకత్వంలో రూపొందుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'బూకి' (Bookie). విజయ్ ఆంటోనీ (Vijay Antony) ఫిల్మ్ కార్పొరేషన్, శరవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. సునీల్‌, మంచు ల‌క్ష్మి, ఇందుమతి, వివేక్ ప్రసన్న కీల‌క పాత్ర‌లు చేశారు. విజ‌య్ అంటోని గెస్ట్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడు. ఇప్ప‌టికే త‌మిళ‌నాట విడుద‌లైన ఈ చిత్రం విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శితం అవుతుండ‌గా ఫిబ్ర‌వ‌రి 20న తెలుగుప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ చేశారు.

ట్రైల‌ర్‌ను చూస్తుంటే ఔట్ అండ్ ఔట్ యూత్‌ఫుల్ ల‌వ్‌, కామెడీ జాన‌ర్‌లో రూపొందిన‌ట్లు తెలుస్తోంది. అప్ప‌టివ‌ర‌కు ల‌వ్‌లో ఉన్న ఇద్ద‌రు ప్రేమికులు బ్రేక‌ప్ అనంత‌రం తిరిగి క‌లిసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తారు. ఈ క్ర‌మంలో వారి ప‌క్క‌నే త‌రుచు అంటి పెట్టుకుని ఉండే స్నేహితులు వారు క‌లువ‌కుండా చేసే ఫ్లాన్లు అనంత‌ర ప‌రిణామాల ఇతివృత్తంలో ఈ మూవీ తెర‌కెక్కిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ఇదిలాఉంటే.. విజ‌య్ అంటోని, అజ‌య్ దిశాన్ ఇద్ద‌రు క‌లిసి గ‌తంలో మార్గాన్ అనే సినిమాతో మంచి విజ‌యం సొంతం చేసుకున్నారు. మీరూ ట్రైల‌ర్‌పై ఓ లుక్కేయండి.

Updated Date - Feb 15 , 2026 | 07:02 PM