వి.ఎన్ ఆదిత్య చేతుల మీదుగా 'విచిత్ర' ట్రైలర్
ABN , Publish Date - Apr 05 , 2026 | 07:39 PM
జ్యోతి పూర్వజ్ కీలక పాత్రలో, రవి, శ్రేయ తివారి జంటగా నటిస్తున్న చిత్రం 'విచిత్ర'.
జ్యోతి పూర్వజ్ (Jyothy poorwaj) కీలక పాత్రలో, రవి, శ్రేయ తివారి జంటగా నటిస్తున్న చిత్రం 'విచిత్ర' (Vichitra). సైఫుద్దీన్ మాలిక్ దర్శక నిర్మాతగా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ 'పోస్టర్ రిలీజ్ కు విచ్చేసిన దర్శకులు వి.ఎన్. ఆదిత్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. విచిత్ర అవుట్ పుట్ బాగా వచ్చింది. ప్రతి తల్లి గుండెకు హత్తుకునేలా ఉంటుంది. ఈ సినిమాను మే 22న విడుదల చేస్తాం' అని అన్నారు. వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ 'విచిత్ర సినిమా టైటిల్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. ధనుంజయ్ రావు లాంటి టెక్నీషియన్ ను పెట్టుకొని అద్భుతంగా తెరకెక్కించారు' అని అన్నారు.