జ్యోతి పూర్వాజ్ హారర్ థ్రిల్లర్ విచిత్ర   

ABN , Publish Date - Mar 28 , 2026 | 06:54 PM

జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్రలో రవి, శ్రియ తివారి జంటగా  నటిస్తున్న చిత్రం ‘విచిత్ర’.

జ్యోతి పూర్వాజ్ (jyothy poorvaj) ప్రధాన పాత్రలో రవి, శ్రియ తివారి జంటగా  నటిస్తున్న చిత్రం ‘విచిత్ర’ (Vichitra). సైఫుద్దీన్ మాలిక్ నిర్మాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్, సెన్సార్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.  మే 22న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. 

Untitled-3.jpg
ఈ సందర్బంగా దర్శక నిర్మాత సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ 'ప్రపంచం మొత్తం దూరమైనా  దగ్గరగా ఉండేది అమ్మ ప్రేమే. ప్రతి ఆడ తల్లి గుండె తల్లడిల్లేలా భావోద్వేగాలతో  కూడిన హర్రర్ థ్రిల్లర్ ఇది. నిజాని అంజన్ అందించిన మ్యూజిక్  సినిమాకు ప్లస్ అవుతుంది.  చిత్ర గారు పడిన తల్లి సెంటిమెంట్ సాంగ్ హైలెట్ గా నిలుస్తుంది. మే 22న సినిమాను విడుదల చేస్తున్నాం' అని అన్నారు.

Updated Date - Mar 28 , 2026 | 07:26 PM