Nithin 36: రూట్ మార్చిన‌ నితిన్.. కొత్త సినిమా జానర్ ఇదే

ABN , Publish Date - Jan 25 , 2026 | 02:44 PM

నితిన్ త‌న 36 సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.

నితిన్ త‌న 36 (Nithin 36) సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. వి.ఐ.ఆనంద్ (Vi Anand) ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ప‌వ‌న్ కుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో  శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ర‌థ స‌ప్త‌మి సంద‌ర్భంగా సైఫై ఎంట‌ర్‌టైన‌ర్‌ను మేక‌ర్స్ అనౌన్స్ చేశారు .విభిన్న‌మైన క‌థ‌లు, క‌థ‌నాల‌తో సినిమాల‌ను రూపొందించే ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్ మ‌రోసారి ఈ భారీ ప్రాజెక్ట్‌తో క్రియేటివ్ బౌండ‌రీస్ రేంజ్‌ను మ‌రింత పెంచ‌టానికి సిద్ధ‌మ‌య్యారు. 


collage.jpg.jpeg

'ఊరు పేరు భైర‌వ‌కోన చిత్రం త‌ర్వాత  వి.ఐ.ఆనంద్ హై కాన్సెప్ట్ సైఫై ఎంట‌ర్‌టైన‌ర్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నున్నారు. సినీ ప్రేక్ష‌కుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని స‌రికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చేలా ఈ క్రేజీ సినిమా రూపొంద‌నుంది. త్వ‌ర‌లోనే షూటింగ్ మొదలుపెడతాం. ఈ సైఫై ఎంట‌ర్‌టైన‌ర్ నితిన్ కెరీర్‌లో అత్యంత ఆస‌క్తిక‌ర‌మై ప్రాజెక్ట్స్‌లో ఒక‌టిగా మార‌నుంది. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే  ప్రకటిస్తాం. 

Updated Date - Jan 25 , 2026 | 05:09 PM