Giri Babu: గిరిబాబు చివరికోరిక నెరవేర్చిన కుమారులు
ABN , Publish Date - Nov 15 , 2026 | 05:28 PM
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నింపిన సీనియర్ నటుడు, లెజెండరీ యాక్టర్ గిరిబాబు (Giribabu) అంత్యక్రియలు పూర్తయ్యాయి.
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నింపిన సీనియర్ నటుడు, లెజెండరీ యాక్టర్ గిరిబాబు (Giribabu) అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రకాశం జిల్లాలోని ఆయన స్వగ్రామం రావినూతలలో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, అభిమానుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. తమ అభిమాన నటుడిని చివరిసారి చూసేందుకు గ్రామస్థులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతూ ఆయనకు తుది వీడ్కోలు (Giribabu Final Rights) పలికారు.
ముఖ్యంగా తండ్రి పార్థివదేహం వద్ద నటుడు రఘుబాబు కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడున్న వారిని కలచివేసింది. ‘నాన్నా’ అంటూ ఆయన భావోద్వేగానికి గురైన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. కుటుంబ సభ్యులను ఓదార్చడం అక్కడున్న వారికి కష్టంగా మారింది. గిరిబాబుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అభిమానులు, స్థానికులు నివాళులు అర్పించారు. అంతకుముందు గిరిబాబు పార్థివదేహానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.
నటుడు మోహన్ బాబుతో పాటు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు తుది వీడ్కోలు పలికారు. 'రావినూతల గ్రామమంటే గిరిబాబుకు ఎంతో ఇష్టమని, తన అంత్యక్రియలు అక్కడే జరగాలని ఆయన కోరుకున్నట్లు కుమారులు రఘుబాబు, రవిబాబు తెలిపారు. ఇప్పుడు స్వగ్రామంలోనే అంతక్రియలు నిర్వహించి గిరిబాబు చివరి కోరిక నెరవేర్చారు ఆయన కుమారులు.
గిరిబాబు మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని పలువురు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. విలక్షణమైన నటనతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన గిరిబాబు ఇక లేరనే వార్తతో తెలుగు సినీ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఆయన నటనను, సినిమాలకు అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు.