Venky Atluri: సమయమే డబ్బు కదా.. అందుకే నాకు కోపం వస్తుంది
ABN , Publish Date - Aug 23 , 2026 | 12:12 PM
‘సార్’, ‘లక్కీ భాస్కర్’.. ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతున్నారు దర్శకుడు వెంకీ అట్లూరి.
‘సార్’, ‘లక్కీ భాస్కర్’.. ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతున్నారు దర్శకుడు వెంకీ అట్లూరి. వరుసగా మంచి ప్రాజెక్ట్‌లు కుదరడం, అవి ప్రేక్షకులకు నచ్చి విజయం సాధించడం ఆనందంగా ఉందని, ఒక మేకర్‌గా ఇది మరింత ప్రోత్సాహాన్ని, బాధ్యతను ఇస్తుందని చెబుతున్నారు. తాజాగా సూర్య హీరోగా ఆయన తెరకెక్కించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం విజయవంతంగా ఆడుతోంది. ఈ సందర్భంగా ఆయన 'నవ్య'తో మాట్లాడారు.
అందుకే స్మూత్‌గా సాగిపోతుంది.
ధనుష్, దుల్కర్ సల్మాన్, ఇప్పుడు సూర్య... వీరంతా తమకంటూ సొంత శైలి ఉన్న వెర్సటైల్ నటులు. అయితే అలాంటి నటులతో పనిచేయడం, వారిని మేనేజ్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే వాళ్లు సిచ్యుయేషన్‌కి, కథకి చాలా త్వరగా అడాప్ట్ అయిపోతారు. ఒకసారి షూటింగ్ ప్రారంభమయ్యాక వాళ్లు స్టార్స్‌లా కాకుండా, తాము పోషిస్తున్న పాత్రలా మాత్రమే ఆలోచిస్తారు. అందుకే వాళ్లతో ప్రయాణం చాలా స్మూత్‌గా సాగిపోతుంది. నేను సాధారణంగా కథ రాసుకునేటప్పుడు ఏ నటుడినీ మనసులో అనుకోను. 100 శాతం కథ పూర్తయ్యాకే దుల్కర్, సూర్య లేదా ధనుష్ వంటి స్టార్స్ దగ్గరకు వెళ్తాను. కథ పిచ్ చేసిన తర్వాత వాళ్లకు నచ్చితే, వారి బాడీ లాంగ్వేజ్‌కి, మ్యానరిజమ్స్‌కి తగ్గట్టు 10 నుంచి 20 శాతం చిన్న చిన్న మార్పులు చేస్తాను. నేను సినిమా సూత్రాలు లేదా స్క్రీన్ ప్లే రూల్స్ పెద్దగా ఫాలో కాను. ఇప్పుడు ప్రేక్షకులు సినిమా చూసే విధానం మారింది. రిలాక్సేషన్ కోసమో, క్లైమాక్స్ ముందు హెవీగా ఉందనో పాటలు పెట్టే లెక్కలను ఆడియన్స్ చూడటం లేదు. ఒకవేళ ఐదు నిమిషాల వ్యవధిలో పది సీన్ల ఎమోషన్‌ను చూపించాలనుకుంటే, పది సీన్లు తీసే బదులు ఆ భావోద్వేగాన్నంతటినీ ఒక పాటలో క్యూములేటివ్‌గా చూపించవచ్చు. కథను బ్రేక్ చేసే పాటలు మాత్రం నా సినిమాలో ఉండకూడదనేది నా సూత్రం.
ప్లేస్ కాదు, .ఎమోషన్ ముఖ్యం
మానవ సంబంధాల మధ్య ఉండే ప్రతీ ఎమోషన్‌నూ నేను హ్యాండిల్ చేయగలను. ప్రత్యేకంగా ఒకటని చెప్పలేను కానీ, ‘హ్యూమన్ డ్రామా’ అంటే నాకు చాలా ఇష్టం. ప్రతీ సీన్‌కు ఒక మూడ్ ఉంటుంది, ఆ మూమెంట్‌కి ఏ ఎమోషన్ కరెక్టో అది రాయడం నాకు ఇష్టం.మనం ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నంత కాలం కొత్త ప్రపంచాన్ని సృష్టించామా? లేదా? అనేది వాళ్లు పెద్దగా పట్టించుకోరు. ప్రేక్షకులు కోరుకునే వినోదాన్ని, ఎమోషన్‌ను ఇస్తే వాళ్లు థియేటర్‌కు వస్తారు. దాని కోసం ఫ్యాటల్ అట్రాక్షన్స్ అక్కర్లేదు. బేసిక్ హ్యూమన్ ఎమోషన్ సరిగ్గా ఉంటే అది పెద్ద బంగ్లాలో ఉన్నా చూస్తారు, టు బెడ్‌రూమ్ ఇంట్లో ఉన్నా చూస్తారు. ఇక్కడ ప్లేస్ కాదు, .ఎమోషన్ ముఖ్యం
అది చివరి ఆప్షన్ కావాలి..
అసిస్టెంట్ డైరెక్టర్‌గా, రైటర్‌గా ఉన్నప్పడు అందరిలాగే నాకూ సాధారణ కష్టాలు ఉన్నాయి. కానీ వాటిని గుర్తుపెట్టుకుని పనిచేయడం లాంటివి నా దగ్గర ఉండవు. అంత పెద్దగా చెప్పుకోదగ్గ నెగెటివ్ మూమెంట్స్ ఏమీ లేవు. నా మీద నేనే ఆధారపడతాను. ఎమోషనల్ సపోర్ట్ కోసం మరొకరిపై ఆధారపడటం అనేది చివరి ఆప్షన్ కావాలి. భావోద్వేగాల విషయానికి వస్తే ఒంటరిగానే వాటిని ప్రాసెస్ చేసుకోవడానికి ఇష్టపడతాను.ప్రస్తుతం కొత్త కథ రాసే పనిలో ఉన్నాను. త్వరలోనే వివరాలు చెబుతాను.
ఓటీటీలు థియేటర్లను రీప్లేస్ చేశాయని అనుకుంటున్నారు. నిజానికి ఓటీటీ అనేది టెలివిజన్‌ను రీప్లేస్ చేసింది. ఒకప్పుడు టీవీ షోల కోసం సమయానికి కూర్చునేవాళ్లం, ఇప్పుడు కంఫర్ట్‌ని బట్టి ఓటీటీలో చూస్తున్నాం. ప్రొడక్షన్ పరంగా ఓటీటీ ఒక ఎక్స్‌ట్రా కుషన్‌లా ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఫిలిం మేకర్స్‌ను మరింత బాధ్యతాయుతంగా, కాంపిటీటివ్‌గా మారుస్తుంది.
నా ప్రపంచం చాలా చిన్నది. పరిశ్రమలో నలుగురైదుగురు స్నేహితులు మాత్రమే ఉన్నారు. వీరి చుట్టూనే నా లోకం తిరుగుతుంది. నేను బయట ఎక్కువ మందితో కలవను. అందుకే పరిశ్రమలోకి రాకముందు, వచ్చాక నా ప్రపంచంలో ఎలాంటి మార్పూ లేదు.
నాకూ కోపం వస్తుంది. ఎందుకంటే ఆ రోజు సినిమా మీద ఖర్చు పెట్టే ప్రతి రూపాయికీ నేను జవాబుదారీ. టైమ్ వేస్ట్ కావడం, ఎవరైనా పని సరిగ్గా చేయకపోవడం నాకు నచ్చదు. సమయమే డబ్బు కదా! ఆ టైమ్‌లో కోపం వచ్చి అరుస్తుంటాను.