వెంకీ–త్రివిక్రమ్ సినిమాకు అసలు హైప్ ఎక్కడ?

ABN , Publish Date - Sep 27 , 2026 | 01:47 PM

విక్టరీ వెంకటేష్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ కాంబినేషన్ పేరు వింటేనే తెలుగు ప్రేక్షకులకు 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ గుర్తుకొస్తాయి. ఆ సినిమాలకు త్రివిక్రమ్ కలం పట్టగా, వెంకీ మామ తన టైమింగ్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు.

విక్టరీ వెంకటేష్(Venkatesh).. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) శ్రీనివాస్.. ఈ కాంబినేషన్ పేరు వింటేనే తెలుగు ప్రేక్షకులకు 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ గుర్తుకొస్తాయి. ఆ సినిమాలకు త్రివిక్రమ్ కలం పట్టగా, వెంకీ మామ తన టైమింగ్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. అయితే, ఇన్నాళ్లకు ఈ వింటేజ్ మ్యాజిక్ మళ్లీ రిపీట్ కాబోతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 9న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, నారా రోహిత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

అయితే, ప్రస్తుతం బాక్సాఫీస్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమా ఎంత పెద్ద స్టార్‌ది అయినా.. సరైన ప్రమోషన్లు, చార్ట్‌బస్టర్ సాంగ్స్ లేదా సాలిడ్ ట్రైలర్ లేకపోతే ప్రేక్షకులు థియేటర్లకు రావడం కష్టమే. ఇటీవల నాని ‘ది ప్యారడైజ్’ చిత్రానికి పాటలు సూపర్ హిట్ కావడంతో, ట్రైలర్ రాకపోయినా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ, ‘ఆదర్శ కుటుంబం’ విషయానికి వస్తే.. వెంకీ-త్రివిక్రమ్ కాంబోపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, అనుకున్నంత స్థాయి బజ్ ఇంకా క్రియేట్ కాలేదని సినీ విశ్లేషకులు, ఫ్యాన్స్ భావిస్తున్నారు. అక్టోబర్ 9న విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ల స్పీడ్ పెంచాలని ఫ్యాన్స్, నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాలేజ్ ఈవెంట్స్, ఫ్యామిలీ మీట్స్ లాంటి ఇంటరాక్టివ్ కార్యక్రమాలు నిర్వహించాలని.. అలాగే చిత్రంలోని ఫన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను హైలైట్ చేస్తూ క్యారెక్టర్ ఇంట్రోలు, షార్ట్ వీడియోలను సోషల్ మీడియాలో నిరంతరం రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ఇప్పుడు గేర్ మార్చినట్లు తెలుస్తోంది. ‘ఆదర్శ కుటుంబం’ ప్రమోషన్ల వేగాన్ని పెంచేందుకు మేకర్స్ సమాయత్తమవుతున్నారట. ఈ క్రమంలోనే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. సినిమా నుంచి 'నారాయణమ్మ' అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను ఈ రోజు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. త్రివిక్రమ్ - థమన్ కాంబినేషన్ అంటేనే మ్యూజికల్ బ్లాక్‌బస్టర్స్. కాబట్టి ఈ పాటతో సినిమా రేంజ్ ఒక్కసారిగా మారిపోతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. పాటలతో పాటు వరుస ఇంటర్వ్యూలు, స్పెషల్ వీడియోలతో ప్రమోషన్లను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లేలా ప్లాన్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఏది ఏమైనా, 'గురూజీ' త్రివిక్రమ్ కట్ చేసే పవర్‌ఫుల్ ట్రైలర్.. అలాగే థమన్ అందించే మ్యూజిక్ మాత్రమే ఈ సినిమాకు సరైన హైప్‌ను తెచ్చిపెట్టే శ్రీరామరక్ష అంటున్నారు అభిమానులు. మరి త్రివిక్రమ్ మాటల పదును, వెంకీ మామ కామెడీ టైమింగ్ మళ్లీ థియేటర్లలో మ్యాజిక్ చేస్తాయా? ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 9న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Updated Date - Sep 27 , 2026 | 02:09 PM