Venkatesh: ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్‌ వాయిదా

ABN , Publish Date - Sep 22 , 2026 | 05:53 PM

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం – AK47’ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది.

విక్టరీ వెంకటేష్(Venkatesh), త్రివిక్రమ్ (Trivikram) శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం – AK47’ (Adarsha kutumbam) విడుదల తేదీ వాయిదా పడింది. తొలుత అక్టోబర్ 2న విడుదల చేయాలని భావించిన ఈ సినిమాను వారం రోజుల పాటు వాయిదా వేసి అక్టోబర్ 9, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా  ప్రకటించింది. ప్రేక్షకులకు మరింత మెరుగైన వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతోనే విడుదలను వాయిదా వేసినట్లు మేకర్స్ తెలిపారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా వెంకటేష్ కనిపించడంతో పాటు.. కామెడీ, ఎమోషన్‌, యాక్షన్‌ అంశాలతో టీజర్‌ ఆకట్టుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. కుటుంబ కథాంశంతో పాటు త్రివిక్రమ్‌ మార్క్‌ కామెడీ, భావోద్వేగాలు సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

Updated Date - Sep 22 , 2026 | 06:41 PM