Venkatesh: ఈ ఆడాళ్లకు యాటిట్యూడ్ తప్ప గ్రాటిట్యూడ్ ఉండదు

ABN , Publish Date - Jul 28 , 2026 | 12:25 PM

వెంకటేష్ హీరోగా నటిస్తున్న‘ఆదర్శ కుటుంబం: హౌస్‌ నెం.47’ చిత్రం నుంచి హీరోయిన్ శ్రీనిధి శెట్టి ప్రాత్రను రివీల్ చేశారు. ఇందులో ఆమె  స్వర్ణ పాత్రలో కనిపించనుంది.  అక్టోబర్‌ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.   

'నా పెళ్ళాం ఉంది.. ఎప్పుడో పెళ్లప్పుడు స్మైల్ ప్లీజ్ అంటే  నవ్వింది.. మళ్లీ ఇప్పటి వరకూ నవ్వలేదు.. ఈ ఆడాళ్లకు యాటిట్యూడ్ తప్ప గ్రాటిట్యూడ్  ఉండదు' అంటూ ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నారు వెంకటేష్. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం: హౌస్‌ నెం.47’ (Aadarsha Kutumbam). ఇందులో వెంకటేష్ కు జోడిగా శ్రీనిధి శెట్టి   స్వర్ణ పాత్రలో కనిపించనుంది.  అక్టోబర్‌ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  సినిమా ప్రచారంలో భాగంగా తాజాగా శ్రీనిధి (Srinidhi Shetty) పాత్రను పరిచయం చేస్తూ టీమ్‌ ఓ  వీడియో  విడుదల చేసింది. ఇందులో వెంకటేష్ చెప్పే డైలాగులు నవ్వులు పూయిస్తున్నాయి

Updated Date - Jul 28 , 2026 | 12:43 PM