ఆదర్శ కుటుంబం.. ఈ నెల కష్టమే
ABN , Publish Date - Oct 11 , 2026 | 10:15 PM
విక్టరీ వెంకటేష్ (Venkatesh), శ్రీనిధి శెట్టి జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం ఏకే 47'.
విక్టరీ వెంకటేష్ (Venkatesh), శ్రీనిధి శెట్టి జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం ఏకే 47 (Aadarsaha Kutumbam) '. నివేతా పేతురాజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాని చినబాబు, నాగవంశీ నిర్మించారు. అన్నీ కలిసివస్తే అక్టోబర్ 9నే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఉండేది. కాకపోతే కొన్ని కారణాల వలన ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిన విషయం తెల్సిందే. ఇక ఈ చిత్రం కొత్త విడుదల తేదీ ఎప్పుడెప్పుడా అని దగ్గుబాటి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మొదట డిస్ట్రిబ్యూటర్ల వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం అక్టోబర్ 30 డేట్ లాక్ చేసినట్లు టాక్ నడిచింది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ డేట్ న కూడా ఆదర్శ కుటుంబం రావడం లేదని తెలుస్తోంది.
ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ప్రస్తుతం జైలర్ 2 ని తెలుగులో రిలీజ్ చేస్తోంది. అక్టోబర్ 15 న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో నాగవంశీ బిజీగా ఉన్నట్లు టాక్. అంతేకాకుండా ఆ మరుసటి రోజే రణబాలి సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతుండటంతో నాగవంశీ ఈ చిత్ర ప్రమోషన్లను కొద్దిగా ఆలస్యం చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే ఆదర్శ కుటుంబం ఈ నెలాఖరున రావడం కూడా కష్టమేనట.
ఇక అక్టోబర్ 30 దాటింది అంటే నవంబర్ లోనే ఆదర్శ కుటుంబం రానుంది. చివరికి ఈ సినిమాని నవంబర్ 20కి షిఫ్ట్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఫిలింనగర్ సర్కిల్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ, ఈ డేట్ మారే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద నెలకొన్న ఈ భిన్నమైన పరిస్థితుల మధ్య ఆదర్శ కుటుంబం ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో చూడాలి.