ఈసారి ఆగేదేలే.. ఆదర్శ కుటుంబం వచ్చేది అప్పుడే
ABN , Publish Date - Oct 20 , 2026 | 04:46 PM
టాలీవుడ్లో మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్లలో ఒకరైన విక్టరీ వెంకటేశ్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కలయికలో తెరకెక్కుతున్న తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆదర్శ కుటుంబం - హౌస్ నెం.47(Aadarsha Kutumbam - House No. 47).
టాలీవుడ్లో మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్లలో ఒకరైన విక్టరీ వెంకటేశ్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కలయికలో తెరకెక్కుతున్న తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆదర్శ కుటుంబం - హౌస్ నెం.47(Aadarsha Kutumbam - House No. 47). నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి అపురూపమైన కుటుంబ కథా చిత్రాల తర్వాత వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటం విశేషం.
పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. అక్టోబరు 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. దసరా పండగ సందర్భంగా వెంకటేశ్ స్వయంగా ఈ విడుదల తేదీని ప్రకటిస్తూ కొత్త పోస్టర్ను అభిమానులతో పంచుకున్నారు. నిజానికి ఈ చిత్రాన్ని మొదట అక్టోబరు 2న గాంధీ జయంతి కానుకగా విడుదల చేయాలని భావించారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతో అక్టోబరు 9కి వాయిదా వేశారు. ఆ తేదీకి కూడా కుదరకపోవడంతో సినిమా అభిమానులకు క్షమాపణలు చెబుతూ చిత్రయూనిట్ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఎట్టకేలకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబరు 30న కచ్చితంగా థియేటర్లలో సందడి చేయడం ఖాయమని మేకర్స్ స్పష్టం చేశారు.
ఈ చిత్రంలో వెంకటేశ్ ఒక మధ్యతరగతి వ్యక్తిగా విలక్షణమైన పాత్రలో కనిపించనున్నాడు. కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, దానికి తగినట్లుగా ఉండే యాక్షన్ పూర్తి స్థాయి వినోదంతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది ఇక ఈ సినిమాలో వెంకటేశ్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. నివేతా పేతురాజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ను థియే,టర్లకు రప్పించే అన్ని హంగులతో రూపుదిద్దుకున్న ఆదర్శ కుటుంబం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.