Trivikram Srinivas: కృష్ణుడు భగవద్గీతను.. రెండు సార్లు చెప్పాడు

ABN , Publish Date - Oct 28 , 2026 | 06:20 AM

ఫ్యామిలీ సబ్జెక్టుల్లో వెంకటేశ్ గారిని మించిన వారు లేరని త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు.

Trivikram Srinivas

'పాతికేళ్ల తర్వాత నేను, త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) చేస్తున్న చిత్రం ఆదర్శ కుటుంబం (Adarsha Kutumbam AK47) 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' చేసిన తర్వాత అంతకు మించిన సినిమా చేయాలనుకున్నాం. అలాంటి చిత్రమే ఇది ఏం జరిగినా ఫ్యామిలీని కాపాడుకుంటాను. వారితోనే ఉంటాననే కాన్సెప్ట్ రూపొందింది. చాలా బాగా వచ్చింది. స్టేడియం బయట సిక్సర్లు కొడతాం' అని విక్టరీ వెంకటేశ్ (Venkatesh) తెలిపారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన నటించిన సినిమా 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిం చింది. ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మాత. శ్రీమతి మమత సమర్పిస్తున్నారు. ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం ప్రీ రిలీజ్ వేడుక జరిగింది.

ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్ మాట్లాడుతూ 'కృష్ణుడు భగవద్గీతను రెండు సార్లు చెప్పాడు. మొదటిది భగవద్గీత. రెండోది ఉద్దవ గీత. ఇందులో ఇప్పటి సమాజంలో మనం చూస్తున్న పలు రకాల కలహాల గురించి ప్రస్తావించాడు. ఇలాంటి తరుణంలో వ్యక్తికి కుటుంబం సపోర్ట్ చాలా కీలకం. కుటుంబసభ్యుల ప్రేమ బావిలో ఊటలా తోడేకొద్దీ వస్తూ ఉంటుంది. అద్భుతమైన కుటుంబ బంధాల గురించి చెప్పడానికి నేనెప్పుడూ ముందుంటాను. ఫ్యామిలీ సబ్జెక్టుల్లో వెంకటేశ్ గారిని మించిన వారు లేరు' అని అన్నారు.

ఈ సినిమాలో నటించడం పట్ల నాయికలు శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty), నివేదా పేతురాజ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. చాలా మంచి సంగీతం కుదిరిందని తమన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Oct 28 , 2026 | 06:26 AM