జనవరి 13 విడుదల.. ఏం టైటిల్ అన్నా అది
ABN , Publish Date - Jun 17 , 2026 | 04:38 PM
స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) స్టైలే సపరేటూ.. ఆయన సినిమా మొదలుపెట్టిన దగ్గరి నుంచి అన్నీ స్పెషల్ గానే ఉంటాయి. అందరిలా ప్రమోషన్స్ చేస్తే మన క్రియేటివిటీ ఏం ఉంటుంది అనుకుంటాడో ఏమో కానీ.. అనిల్ సినిమా అంటేనే చాలా స్పెషల్ అనుకొనేలా చేస్తాడు.
స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) స్టైలే సపరేటూ.. ఆయన సినిమా మొదలుపెట్టిన దగ్గరి నుంచి అన్నీ స్పెషల్ గానే ఉంటాయి. అందరిలా ప్రమోషన్స్ చేస్తే మన క్రియేటివిటీ ఏం ఉంటుంది అనుకుంటాడో ఏమో కానీ.. అనిల్ సినిమా అంటేనే చాలా స్పెషల్ అనుకొనేలా చేస్తాడు. సాధారణంగా సినిమా టైటిల్స్ ఎలా ఉంటాయి. కథకు అనుగుణంగా.. హీరోహీరోయిన్ల పేర్లతో టైటిల్స్ పెడతారు. కానీ, అనిల్.. మాత్రం ఏది అనుకుంటే అదే టైటిల్ గా మారిపోతుంది. అలాగే సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ని పెట్టి షాక్ ఇచ్చిన అనిల్.. ఇప్పుడు మరో మెంటలెక్కించే టైటిల్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది.
మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న అనిల్.. ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్ తో కలిసి ఒక మల్టీస్టారర్ ప్లాన్ చేసిన విషయం తెల్సిందే.ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ సైతం ఇప్పటికే పూర్తి కాగా, త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ సినిమాలో వెంకీ, కళ్యాణ్ రామ్ బావా బామ్మర్దులుగా కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది. ఇది కాకుండా తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
సంక్రాంతికి వస్తున్నాం లానే ఈ సినిమాకు ఒక వైరైటీ టైటిల్ ని అనుకున్నాడట. ఈ చిత్రానికి ఏకంగా జనవరి 13 విడుదల అనే ఊహించని టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్ డేట్‌నే నేరుగా టైటిల్‌గా మార్చేసి అనిల్ రావిపూడి తన మార్క్ క్రేజీ స్ట్రాటజీతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. సినిమా పక్కాగా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13నే థియేటర్లలోకి రాబోతుందని సమాచారం. జూన్ 18 న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఇక ఈ వార్త తెలియడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అదేం టైటిల్ అన్నా అని కొందరు.. ఏప్రిల్ 1 విడుదల అని వంశీ తెరకెక్కిస్తే లేనిది.. జనవరి 13 విడుదల అని తాను తెరకెక్కిస్తే వచ్చిందా అని అనిల్ అనుకొని ఉంటాడు.. అందుకే ఈ టైటిల్ ని పెట్టి ఉంటాడు అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.