Sri Chidambaram: ఓ న‌వ్వుతో.. మొద‌లు పెడ‌దాం రోజుని.. కీర‌వాణి నోట సోల్‌ఫుల్ మెలోడీ

ABN , Publish Date - Jan 22 , 2026 | 08:13 PM

వంశీ తుమ్మల (Vamsi Tummala), సంధ్యా వశిష్ట (Sandhya Vasishta) జంటగా రూపొందిన చిత్రం ‘శ్రీ చిదంబరం’.

Sri Chidambaram

వంశీ తుమ్మల (Vamsi Tummala), సంధ్యా వశిష్ట (Sandhya Vasishta) జంటగా రూపొందిన చిత్రం ‘శ్రీ చిదంబరం’(Sri Chidambaram). క వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం త‌ర్వాత‌ శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి ఈ సినిమాను నిర్మించ‌గా వినయ్ రత్నం (Vinay Ratnam) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఫీల్‌గుడ్ విలేజ్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌లకు రెడీ అవుతోంది. ఈనేప‌థ్యంలో ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజ్ గ్లిమ్స్‌, టీజ‌ర్‌, పాట‌లు అన్నీ ఒక దాన్ని మించి మ‌రోటి విజ‌య‌వంతం అయి సినిమాపై మంచి హైప్స్ తీసుకు వ‌చ్చాయి. టీజ‌ర్ అయితే.. మ‌నం ఎక్కువ‌గా చూసే మ‌ల‌యాళ సినిమాల త‌ర‌హాలో ఓ గ్రామంలో జ‌రిగే క‌థ హృద్యంగా సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది.

అయితే తాజాగా ఈమూవీ నుంచి ఓ న‌వ్వుతో.. మొద‌లు పెడ‌దాం రోజుని అంటూ సాగే ఓ ఇన్సిపిరేష‌న‌ల్‌, సోల్‌ఫుల్ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అస్కార్ విన్న‌ర్ కీర‌వాణి (M.M.Keeravani) ఈ పాట‌ను స్వ‌యంగా ఆల‌పించ‌డంతో విడుద‌ల చేయ‌డం విశేషం. చంద్ర శేఖ‌ర్ (Chandra Sekar) సాహిత్యం అందించ‌గా చందు (Chandu), ర‌వి (Ravi) సంగీతం అందించారు. ఈ పాట ట్యూన్‌తో పాటు లిరిక్స్‌ అందరి హృదయాలను హత్తుకునేలా ఇట్టే క‌నెక్ట్‌లా ఉన్నాయి. ముఖ్యంగా కీరవాణి గారి గాత్రం ఈ పాటకు ప్రాణం పోసింది. మీరూ ఓ మారు విని, చూసి ఆస్వాదించండి.

Updated Date - Jan 22 , 2026 | 08:14 PM