BharataVarsha: ఓ .. వీర.. జయధీరా .. ఏముంది సాంగ్
ABN , Publish Date - Jun 19 , 2026 | 09:12 PM
మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) కొన్నేళ్లుగా ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న విషయం తెల్సిందే. మంచి మంచి కథలు, డైరెక్టర్స్ ని ఎంచుకుంటున్నా కూడా ఎందుకో ఈ హీరోని ప్రేక్షకులు ఆదరించలేకపోతున్నారు.
మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) కొన్నేళ్లుగా ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న విషయం తెల్సిందే. మంచి మంచి కథలు, డైరెక్టర్స్ ని ఎంచుకుంటున్నా కూడా ఎందుకో ఈ హీరోని ప్రేక్షకులు ఆదరించలేకపోతున్నారు. అయినా సరే గోపీచంద్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా ప్రేక్షకులను మెప్పించాలని కంకణం కట్టుకున్నాడు. ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా గోపీచంద్ నుంచి వస్తోన్న చిత్రాల్లో ఒకటి భరతవర్ష( BharataVarsha). సంకల్ప్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్నారు. ఇక ఈ సినిమాలో గోపీచంద్ సరసన రీతూ వర్మ నటిస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా భరతవర్ష నుంచి మొదటి లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. వీర జయధీరా అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ పాట హీరో క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసేలా ఎంతో పవర్‌ఫుల్‌గా సాగుతుంది. 'పయనించే శిఖరం నువ్వేరా.. ప్రవహించే సమరం నువ్వేరా.. ఈ పుడమికి కావలి నువ్వురా' అంటూ సాగే లిరిక్స్ వింటుంటేనే గూస్‌బంప్స్ వస్తున్నాయి. హీరో మంచి హృదయం వెనుక ఉన్న వ్యధను, లక్ష్యాన్ని తెలియజేసేలా ఈ పాటను ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. పాటలో చూపించిన విజువల్స్, గోపీచంద్ రస్టిక్ అండ్ ఇంటెన్స్ లుక్ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో చెప్తున్నాయి.
ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ అందించిన లిరిక్స్ ని దీపక్ బ్లూ, లక్ష్మీ మేఘన అద్బుతంగా ఆలపించారు. ఈ సాంగ్ సినిమాపై హైప్ ని క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సాంగ్ చూసిన ఫ్యాన్స్ .. ఏముంది సాంగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతోనైనా గోపీచంద్ హిట్ అందుకుంటాడా.. లేదా.. అనేది చూడాలి.