కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలక్షన్స్.. అదిరిపోయాయి అంతే

ABN , Publish Date - Aug 08 , 2026 | 03:31 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా హారర్ కామెడీ చిత్రం కొరియన్ కనకరాజు(Korean Kanakaraju) ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధిస్తూ గ్రాండ్ ఓపెనింగ్‌ను నమోదు చేసుకుంది.

Korean Kanakaraju

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej నటించిన తాజా హారర్ కామెడీ చిత్రం కొరియన్ కనకరాజు(Korean Kanakaraju) ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధిస్తూ గ్రాండ్ ఓపెనింగ్‌ను నమోదు చేసుకుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్లతో కలిపి రూ.10.20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి, వరుణ్ తేజ్ కెరీర్‌లోనే అతిపెద్ద ఓపెనర్ మూవీగా నిలిచింది.


ముందుగానే నిర్వహించిన పెయిడ్ ప్రీమియర్ల నుంచి వచ్చిన పాజిటివ్ టాక్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్‌గా మారింది. తొలి రోజు నుంచే పట్టణ ప్రాంతాలతో పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రేక్షకుల రాక భారీగా పెరిగింది. భయపెట్టే హారర్ ఎలిమెంట్స్‌తో పాటు ఆద్యంతం నవ్వించే కామెడీ డోస్ సమపాళ్లలో ఉండటమే ఈ సినిమా విజయానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.ముఖ్యంగా సత్య కామెడీ ఈ సినిమాకు ప్లస్ గా నిలిచింది.


రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్‌లో కూడా ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. బుక్‌మైషో మరియు డిస్ట్రిక్ట్ యాప్‌లలో కలిపి ఇప్పటివరకు 2.5 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం తన హవా చూపిస్తూ నార్త్ అమెరికాలో లక్షా 75 వేల డాలర్ల గ్రాస్‌ను దాటేసింది. సోమవారం బోనాలు పండుగ సెలవు దినం కూడా తోడవనుండటంతో, రాబోయే లాంగ్ వీకెండ్‌లో కొరియన్ కనకరాజు మరిన్ని భారీ వసూళ్లను రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వరుణ్ తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా ఈ సినిమా బాక్సాఫీస్ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. మరి ముందు ముందు ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Updated Date - Aug 08 , 2026 | 03:33 PM